Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

వైఫ్ ఆఫ్ రామ్ ఇక్కడ

వైఫ్ ఆఫ్ రామ్ ఇక్కడ

వైఎఫ్ ఆఫ్ రామ్ అంటూ ఫస్ట్ లుక్ తో వచ్చేసింది హీరోయిన్ మంచు లక్ష్మి. హీరోయిన్ కీలక పాత్ర వున్న కథతో నిర్మిస్తున్న థ్రిల్లర్ సినిమా ఇది. వైవిధ్యమైన సినిమాలు నిర్మించే ప్రయత్నం చేస్తున్న పీపుల్స్ మీడియా పతాకంపై నిర్మిస్తున్న సినిమా ఇది.

అవుట్ ఆఫ్ ద బాక్స్ ఐడియాతో తయారుచేసిన కథలో ధీక్ష అనే పాత్రలో మంచు లక్ష్మి కనిపిస్తారు. అనుక్షణం భయపడుతున్నట్లు కనిపిస్తుంది. కానీ అంతలోనే భయం లేని పోరాటం సాగిస్తున్నట్లు వుంటుంది. ఆమె ఏమిటి? అన్నది అంతుపట్టకుండా సినిమా సాగుతుంది.

సినిమా చివరి వరకు ఉత్కంఠ వీడకుండా వుండడమే వైఫ్ ఆఫ్ రామ్ స్క్రీన్ ప్లే చమత్కారం అని నిర్మాతలు తెలిపారు. ధీక్ష అనే ఆమెకు ఒక స‌మ‌స్య ఉందా! లేక ఆమే ఒక స‌మ‌స్యా..? అనే పాయింట్ తో తయారైన థ్రిల్లర్ ఇది.

ఇదిలా వుంటే జూన్ 1న వైఫ్ ఆఫ్ రామ్ ట్రైల‌ర్ ని విడుద‌ల చేస్తారు. స‌మాజాన్ని ప్రభావితం చేసిన మ‌హిళ‌ల స‌మ‌క్షంలో ఈ ట్రైల‌ర్ ను లాంచ్ చేయ‌బోతున్నారు. విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు విజయ్ యెలకంటి దర్శకుడు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?