చిరు కోరిక: అది కొరటాలతో అయ్యే పనేనా?

“సెట్స్ లో మనస్ఫూర్తిగా నవ్వి దాదాపు రెండేళ్లు అయింది. సైరాలో అస్సలు నవ్వలేదు. కామెడీ లేదు. నా స్టయిల్ స్టెప్పులు లేవు. అవన్నీ నేను చాలా మిస్ అయ్యాను. నా నెక్ట్స్ సినిమాలో ఇవన్నీ…

“సెట్స్ లో మనస్ఫూర్తిగా నవ్వి దాదాపు రెండేళ్లు అయింది. సైరాలో అస్సలు నవ్వలేదు. కామెడీ లేదు. నా స్టయిల్ స్టెప్పులు లేవు. అవన్నీ నేను చాలా మిస్ అయ్యాను. నా నెక్ట్స్ సినిమాలో ఇవన్నీ తప్పకుండా ఉండేలా చూసుకుంటాను.”

చిరంజీవి రీసెంట్ స్టేట్ మెంట్ ఇది. అతడు చెప్పింది నిజం కూడా. అయితే నెక్ట్స్ సినిమాలో ఇవన్నీ చూడొచ్చా అంటే మాత్రం కాస్త అనుమానం వ్యక్తంచేయాల్సిందే. ఎందుకంటే, చిరంజీవి తన తర్వాతి ప్రాజెక్టును కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్నాడు. కొరటాల సినిమాలు ఎమోషనల్ గా ఉంటాయి, కథాబలంతో నడుస్తుంటాయి. పైపెచ్చు ఇతడి సినిమాల్లో కామెడీకి చోటు లేదు. కొరటాల గత సినిమాల్ని పరిశీలిస్తే ఈ విషయం ఈజీగానే అర్థమౌతుంది. ఇలాంటి దర్శకుడితో చిరంజీవి చేస్తున్న సినిమాలో కామెడీ ఆశించడం అత్యాశే అవుతుంది.

ఇక డాన్స్ విషయానికొస్తే, అది మాత్రం కొరటాల శివ సినిమాల నుంచి ఆశించొచ్చు. ఎందుకంటే జనతాగ్యారేజ్, శ్రీమంతుడు, భరత్ అనే నేను లాంటి సినిమాల్లో మంచి పాటలున్నాయి. అందులో ఒకట్రెండ్ సాంగ్స్ లో డాన్స్ మూమెంట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి చిరంజీవి-కొరటాల సినిమాలో కూడా మంచి డాన్స్ మూమెంట్స్ ఎక్స్ పెక్ట్ చేయొచ్చు. ఎటొచ్చి కామెడీనే కష్టం అనిపిస్తోంది.

కథ నుంచి పక్కకు జరిగి ఒక్క సన్నివేశం కూడా పెట్టడు కొరటాల. కథకు అడ్డు తగులుతుందని భావిస్తే కామెడీ సీన్ నే కాదు, ఏకంగా ఆ క్యారెక్టర్ నే తీసి పక్కనపెట్టేస్తాడు ఇతడు. పైగా చిరంజీవి కోసం ఓ సీరియస్ కథ రాసుకున్నాడు. సీరియస్ సబ్జెక్ట్ ఎంచుకున్నాడు. అన్నింటికి మించి దాదాపు కథ-స్క్రీన్ ప్లే పూర్తిచేశాడు. ఇలాంటి టైమ్ లో కామెడీ పెట్టమని చిరంజీవి డిమాండ్ చేస్తే కష్టమే. సో.. ఈసారి చిరంజీవి కోరిక సగమే నెరవేరేలా ఉంది. కొరటాల సినిమాలో చిరంజీవి డాన్స్ ఉండొచ్చు కానీ కామెడీ కష్టమే.

నవంబర్ మొదటి వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. హైదరాబాద్ లోనే ఓ ప్రత్యేకమైన సెట్ లో ఈ షూట్ స్టార్ట్ అవుతుంది. కొణెదల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్లపై ఈ సినిమా రాబోతోంది.

అల్లువారింట్లో సైరా పార్టీ.. అక్కినేని హీరో కూడా