సాధారణంగా సినిమా ఫంక్షన్లు అంటే శని ఆది వారాల్లో వుంటాయి. కానీ పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్ లోని అజ్ఞాతవాసి సినిమా ఫంక్షన్ చేయడానికి శని, ఆదివారాలు సరైన వెన్యూ దొరకడం లేదట. అందువల్ల సోమ, మంగళవారాల్లో జరపక తప్పదా లేదా, ఆల్టర్ నేటివ్ వెన్యూలు ఏమైనా వున్నాయా? అన్నది చూస్తున్నారు. ప్రస్తుతానికి 18, లేదా 19డేట్లు పరిశీలిస్తున్నారు. ఈలోగా కనుక సరైన వెన్యూ శని, ఆదివారాల్లో దొరికితే, అటు వెళ్తారు.
ఒక దశలో లాల్ బహదూర్ స్టేడియం అని కూడా అనుకున్నారు. కానీ అక్కడ తెలుగు మహాసభలు ఏవో వున్నాయని అన్నారు. దాంతో ఆగింది. పోనీ తిరువతి, విశాఖ వెళ్దామా అనుకున్నారు కానీ అదీ సెట్ కాలేదు. దాంతో హైదరాబాద్ లోనే వెన్యూ కోసం వెదుకులాట ప్రారంభమైంది. ఎటొచ్చీ శని, ఆదివారాలు ఏ వెన్యూ దొరుకుతుందా అని చూస్తున్నారు.
ఈసారి కూడా అడియో ఫంక్షన్ లో రేర్ టాలెంట్ ను ప్రోత్సహించే విధమైన కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. దేశం నలుమూలల నుంచి మంచి టాలెంట్ ప్రద్శన చేయగలిగిన వాళ్ల గురించి తెలుసుకుని రప్పించే పని స్టార్ట్ చేసారు. అంతే తప్ప, పాటలకు డ్యాన్స్ లు చేసే రికార్డింగ్ డ్యాన్స్ ప్రోగ్రామ్ లు వుండవు
మరో అయిదు రోజులు షూట్.
ఇదిలా వుంటే పవన్ బృందం కాశీ నుంచి రేపు తిరిగి వస్తుంది. వచ్చిన తరువాత లోకల్ గా మరో అయిదు రోజులు వర్క్ వుంటుంది. ఇందులో ప్యాచ్ వర్క్ తో పాటు, కొన్ని సీన్లు కూడా వున్నాయి. మైండ్ స్పేస్ దగ్గర కొంత వర్క్ వుంది. అయితే అక్కడ వర్కింగ్ డేస్ పర్మిషన్ ఇవ్వరు. అందువల్ల వచ్చే ఆదివారం దాకా ఆగి షూట్ చేయాలి. అప్పటితో టోటల్ టాకీ, సాంగ్స్ పూర్తయినట్లు.