Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

వరల్డ్ ఫేమస్ కాముకుడు

వరల్డ్ ఫేమస్ కాముకుడు

లవర్ అనే పదం వినడానికి ఎలా వున్నా, దాని తెలుగు అర్థం ప్రేమికుడు అంటే మాత్రం అందంగా అద్భుతంగా వుంటుంది. వరల్డ్ ఫేమస్ లవర్ అంటే ప్రపంచ ప్రఖ్యాత ప్రేమికుడు అని తర్జుమా చేసుకున్నా ఇంకా బాగుంటుంది. ఇలాంటి టైటిల్ పెట్టి, అలాంటి బ్యాక్ డ్రాప్ తో కథ అల్లితే, ఆ ప్రేమికుడు ఎంత గొప్పవాడో? ఎంత అద్భుతమైన ప్రేమ మూర్తి అన్న ఆసక్తి వుంటుంది.

కానీ రచయిత క్రాంతి మాధవ్ (ఇక్కడ దర్శకుడిగా అతడిని చూడడం లేదు) మాత్రం ఓ సాదా సీదా క్యారెక్టరైజేషన్ తయారుచేసి, ఆ క్యారెక్టర్ నే ప్రపంచ ప్రఖ్యాత ప్రేమికుడు అనేసుకోమన్నాడు. ఎందుకు అంత ప్రపంచ ప్రఖ్యాత అంటే ఓ ప్రియురాలి కోసం ఉద్యోగం త్యాగం చేసాడు. మరో ప్రియురాలి కోసం కళ్లు త్యాగం చేసాడు అని ఆయన భావన కావచ్చు. కానీ కేవలం త్యాగం మాత్రమే ఓ అద్భుతమైన ప్రేమికుడిని ఆవిష్కరించదు. ప్రియురాలి పట్ల ఆ ప్రేమికుడి ప్రవర్తన, ఎక్స్ ట్రా..ఎక్స్ ట్రా అన్నీ కలిపి అతని ప్రపంచ ప్రఖ్యాత ప్రేమికుడిని చేస్తాయి.

క్రాంతి మాధవ్ సృజించిన ప్రేమికుడు ఎలా వుంటాడు?

కథ రాసుకునే రంథిలో పడి తను ఎలా వున్నాడో చూసుకోడు.

వండి పెట్టింది ఏదైనా వుంటే తింటాడు లేదంటే లేదు.

కూడా వుండే అమ్మాయి ఎలా వుందో చూడడు. వెళ్తున్నా అంటే అటు తిరగకుండానే చేయి ఊపేస్తాడు. 

పక్కన వున్న అమ్మాయి జలజలా కన్నీళ్లు రాలుస్తున్నా పట్టదు.

కానీ..కానీ. రాత్రి అయ్యేసరికి శారీరకంగా అనుభవించేసి, తన మానాన తాను పక్కకు తిరిగి పడుకుంటాడు.

ఇలాంటి వాడు వరల్డ్ ఫేమస్ లవర్.

ఇక ఇలాంటి రైటర్ క్రియేట్ చేసిన ప్రేమికులు ఎలా వుంటారు?

భార్య వున్నా, వేరే అమ్మాయి కేసి లొట్టలు వేస్తూ చూస్తాడు. 

ఆ అమ్మాయి అర కొర బట్టలు వేసుకుంటే, ఓర చూపులు, కోర చూపులు చూస్తుంటాడు.

నాన్న కిందపడిపోయాడ్రా మగడా అని ఫోన్ చేస్తే,బిజీగా వున్నా అని అబద్దం చెప్పేస్తాడు.

ఇతగాడో వరల్డ్ ఫేమస్ లవర్.

ఇక మూడో లవర్ కూడా వున్నాడు. అతగాడు విదేశీ అమ్మాయిని చూసి, ఇదేంటీ ఫారిన్ అమ్మాయి కదా? కబుర్లు చెబ్తున్నా ఏంటీ? రంగంలోకి దింపేయక అని విదేశీ అమ్మాయిలను చులకనగా అంచనా వేస్తాడు.

ఆ అమ్మాయి ఫలానా దుస్తుల్లో నిన్ను చూడాలని వుంది అంటే, అవి వేసుకొచ్చి, ఆమెను బలవంతంగా అనుభవించాలని చూస్తాడు. ఆ సీన్ ఎలా వుంటుందీ అంటే, ఆమెను దాదాపు రేప్ చేస్తున్నట్లే. ఆమె కూడా అందుకే లాగి దూరంగా పడేలా తోసేస్తుంది.

ఇలాంటివాడు వరల్డ్ ఫేమస్ లవర్. ఇలాంటి పాత్రలతో కూడిన సినిమాకు వరల్డ్ ఫేమస్ లవర్ అనే టైటిల్. అలాంటి చెత్త పుస్తకాన్ని మిలియన్లలో కొనేస్తారట పాఠకులు. 

క్రాంతి మాధవ్ లాంటి మంచి రచయిత (మళ్లీ మళ్లీ ఇది రాని రోజు దృష్టిలో పెట్టుకుని అంటున్న మాట ఇది) ఇలాంటి ప్రపంచ ప్రఖ్యాత కామకుడిని అందించి, ప్రేమికుడు అంటాడేంటీ?

-రాజా

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?