విజయ్ దేవరకొండ. ఈ పేరుకు కొంత బాక్సాఫీస్ దగ్గర పుల్లింగ్ పవర్ వుంది. గతంలో వచ్చిన హిట్ లు కావచ్చు, ఫ్లాపులు కావచ్చు తొలి రోజు ఆ విషయాన్ని ప్రూవ్ చేసాయి. కానీ ఆ పుల్లింగ్ పవర్ రాను రాను తగ్గుతోందని తెలుస్తోంది. క్రాంతి మాధవ్ డైరక్షన్ లో విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో గట్టిగా నాలుగున్నర కోట్లు ఓపెనింగ్స్ తెచ్చుకోలేకపోయింది. పైగా ఈ ఫిగర్ లో జిఎస్టీ యాడ్ అయి వుంది. ఒకటి రెండు చోట్ల ఫిక్స్ డ్ హయ్యర్లు లాంటి కలుఫుళ్లు కూడా వున్నాయి. డియర్ కామ్రేడ్ కు తొలిరోజు ఏడున్నర కోట్ల వరకు వసూళ్లు రావడం విశేషం.
ముఖ్యంగా విజయ్ క్రేజ్ బలంగా వున్న నైజాంలో డియర్ కామ్రేడ్ కు మూడు కోట్లకు పైగా ఫస్ట్ డే షేర్ వస్తే, వరల్డ్ ఫేమస్ కు రెండు కోట్ల మేరకు మాత్రమే వచ్చింది. ఇదే తేడా దాదాపు ప్రతి ఏరియాలోనూ కనిపించింది. నిజానికి డియర్ కామ్రేడ్ కు కొత్త దర్శకుడు పని చేసారు. వరల్డ్ ఫేమస్ లవర్ కు ఒక మంచి హిట్ చేతిలో వున్న క్రాంతి మాధవ్ పని చేసారు. అయినా డియర్ కామ్రేడ్ పరాజయం వరల్డ్ ఫేమస్ లవర్ మీద ప్రభావం చూపించింది అనుకోవాలి.
తొలి రోజు వసూళ్లు ఇలా వున్నాయి
నైజాం…………2.10 కోట్లు
సీడెడ్………….0.39 లక్షలు
ఉత్తరాంధ్ర……0.52 లక్షలు
ఈస్ట్……………0.30 లక్షలు
వెస్ట్ ……………0.20 లక్షలు
కృష్ణ…………….0.25 లక్షలు
గుంటూరు……..0.43 లక్షలు
నెల్లూరు…………0.18 లక్షలు