ఈనాటి సుప్రభాత గీతం అంటూ ఓ మాంచి పవర్ ఫుల్ సాంగ్ ను బయటకు వదిలారు యాత్ర సినిమా మేకర్లు. జననేత వైఎస్ రాజశేఖర రెడ్డి బయోపిక్ ఇది. ఈ సినిమా సంక్రాంతికి విడుదలవుతుంది. అయితే ఈరోజు వైఎస్ వర్థంతి సందర్భంగా ఓ పాటను విడుదల చేసారు.
వైఎస్ కు జనం జేజేలు పలుకుతూ పాడే కీర్తి గీతం ఇది. నిజానికి ఇప్పుడు ఈపాట విడుదల చేయడం అంటే సాహసమే. ఎందుకుంటే, సినిమా వైఎస్ పాత్రలో మమ్ముట్టి ఎలా వుండేదీ ప్రేక్షకులకు క్లియర్ గా తెలిసిపోతుంది. ఫస్ట్ లుక్ వదలడం వేరు. అది జస్ట్ స్టిల్ మాత్రమే. ఇది ఫుల్ సాంగ్.
అయితే యాత్ర మేకర్ల ధైర్యం ఏమిటో పాట బయటకు వచ్చాక తెలిసింది. మమ్ముట్టి అచ్చం వైఎస్ఆర్ లా పాత్రలోకి ఒదిగిపోయినట్లే అనిపించింది పాట చూస్తుంటే. పాటకు పెట్టిన బ్లాక్ లు కొన్ని ఆకట్టుకునేలా వున్నాయి.
పాటలో ఓ గమ్మత్తు చేసారు. అప్పట్లో వైఎస్ పాదయాత్ర చేసింది కాంగ్రెస్ జెండాలతో. కానీ ఇప్పుడు జగన్ వున్నది వైకాపా జెండా కింద. లేనిపోని సమస్యలు, ఇబ్బందులు వస్తాయని కావచ్చు. కొత్త జెండా ఒకటి క్రియేట్ చేసారు. కాంగ్రెస్ రంగుల జెండాపై పిడికిలి బిగించిన చేయి గుర్తు జోడించారు. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో ఒక కొత్త గుర్తు కనిపించినట్లు అయింది.
జగన్-జనసేన కలిస్తే ఆ కలయిక అపూర్వంగా వుంటుందని కామెంట్లు వున్నాయి. 2014లో టీడీపీకి మద్దతు ఇచ్చిన జనసేన, ఇప్పుడు కనుక జగన్ తో చేతులు కలిపితే అన్న ఆలోచనలు వున్నాయి. ఈ జెండా ఆ ఎజెండాను చూపించినట్లు కనిపించింది.
ఆ విషయం అలా వుంచితే పాటకు కె. అందించిన ట్యూన్ చాలా బాగుంది. దానికి సీతారామశాస్త్రి సాహిత్యం, కాలభైరవ గళం పక్కాగా సరిపోయాయి.