Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఆ సినిమా నుంచి అమ‌లాపాల్ త‌ప్పుకున్న‌దందుకే...

ఆ సినిమా నుంచి అమ‌లాపాల్  త‌ప్పుకున్న‌దందుకే...

హీరోయిన్ అమ‌లాపాల్ ఏం చేసినా ఓ ప్ర‌త్యేక‌త ఉంటుంది. న‌ట‌న‌లోనూ, వ్య‌క్తిగ‌త జీవితంలోనూ త‌న‌దంటూ ప్ర‌త్యేక ముద్ర ఉండాల‌ని ఆమె భావిస్తుంటారు. అందుకు త‌గ్గ‌ట్టు ఎప్ప‌టిక‌ప్పుడు నిర్ణ‌యాలు తీసుకుంటూ ఉంటారు. ఈ ప‌రంప‌రంలో కొన్ని వివాదాస్ప‌దాలు కావ‌డం మ‌నం చూశాం. అయినా ఆమె దేన్నీ లెక్క చేయ‌రు. తానేం అనుకుంటుందో అదే చేస్తారు త‌ప్ప‌...స‌మాజ‌మో, ఇంకో దాని కోసం త‌న నిర్ణ‌యాల‌ను, అభిప్రాయాల‌ను మార్చుకోని వ్య‌క్తిత్వం ఆమె సొంతం.

తాజాగా అలాంటి నిర్ణ‌య‌మే ఆమె తీసుకున్నారు. స‌హ‌జంగా మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో న‌టించే అవ‌కాశం వ‌స్తే...ఎవ‌రైనా ఎగిరి గంతేస్తారు. కానీ అమ‌లాపాల్ అలా చేయ‌లేదు. అదే ఆమె స్పెష‌ల్ అని మ‌నం ముందే చెప్పుకున్నాం క‌దా. ఇంత‌కూ కార‌ణం ఏమిటా అని అంద‌రూ ఆరా తీశారు. దీనికి ఆమె క్లారిటీ ఇచ్చారు.

మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్, ఐశ్వర్యా రాయ్, త్రిష, కార్తీ, ‘జయం’ రవి ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న తమిళ  చిత్రం ’పొన్నియిన్‌ సెల్వన్‌’.  ఈ సినిమాలో అమలా పాల్‌ కూడా నటించాల్సి ఉంది. కానీ  ఈ ప్రాజెక్ట్‌ నుంచి ఆమె తప్పుకున్నారామె. తానెందుకు షూటింగ్ ప్రారంభం కాక‌ముందే త‌ప్పుకోవాల్సి వ‌చ్చిందో తాజాగా ఇచ్చిన‌ ఓ ఇంటర్వ్యూలో వివ‌రించారామె.

‘మనకి అవ‌కాశం ఇచ్చారు క‌దా అని అన్ని సినిమాల్లో నటించలేం.  ‘పొన్నియిన్‌ సెల్వన్‌’లోని పాత్రకు నేను సరిపోను అని నా అంత‌రాత్మ‌కు అనిపించింది. న్యాయం చేయలేమ‌ని అనిపించినప్పుడు చేయకపోవడమే ఉత్తమం. అందుకే ఆ సినిమా నుంచి నేను త‌ప్పు కోవాల్సి వ‌చ్చింది. మణిరత్నంగారి సినిమాలో నటించే అవకాశం మళ్లీ వస్తుందని ఆశిస్తున్నాను’ అని అమ‌లాపాల్‌ పేర్కొన్నారు. ఆమె ఆశ నెర‌వేరాల‌ని మ‌నం కూడా కోరుకుందాం. 

తెలుగులో అద్భుతంగా మెసేజ్ ఇచ్చిన నవనీత్ కౌర్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?