Advertisement

Advertisement


Home > Movies - Movie News

కమల్ మాటలు ఇప్పుడు నిజమవుతున్నాయా..?

కమల్ మాటలు ఇప్పుడు నిజమవుతున్నాయా..?

విశ్వరూపం సినిమా విడుదల సమయంలో.. థియేటర్ల కంటే ఒకరోజు ముందుగా డీటీహెచ్ లలో సినిమా వదలాలనే ప్రతిపాదన చేశారు హీరో కమల్ హాసన్. అయితే అప్పుడు చాలామంది నిర్మాతలు, థియేటర్ల ఓనర్లు గగ్గోలు పెట్టారు. థియేటర్ల కంటే ముందు డీటీహెచ్ లలో సినిమా బైటకు వస్తే.. ప్రేక్షకులెవరూ తర్వాత థియేటర్లకు రారని, పైరసీకి ఎక్కువగా అవకాశం ఉంటుందని అనుమానాలు వెలిబుచ్చారు, అడ్డుపడ్డారు.

2012లో జరిగిన ముచ్చట ఇది. ఎనిమిదేళ్ల తర్వాత కమల్ హాసన్ ప్రతిపాదనే ఇప్పుడు నిర్మాతలకున్న ఏకైక అవకాశంగా మారిందనడంలో ఆశ్చర్యంలేదు. అప్పుడంటే డీటీహెచ్ లే ఏకైక అవకాశం. ఇప్పుడు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లు విరివిగా అందుబాటులోకి వచ్చాయి. కరోనా దెబ్బతో ఇప్పుడప్పుడే థియేటర్లు తెరిచే అవకాశం లేదు, తెరిచినా జనాలు ఒకప్పటిలా ఎగబడి థియేటర్లకు వస్తారనే ఆశలు కూడా లేవు. 

అందుకే.. అన్ని వ్యవహారాలు పూర్తయి థియేటర్లలోకి వెళ్లాల్సిన సినిమాలను ఎలాగోలా ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నారు నిర్మాతలు. థియేటర్ రైట్స్ పక్కనపెట్టి.. శాటిలైట్, డిజిటల్ రైట్స్ తో గట్టెక్కే ఆలోచన చేస్తున్నారు. థియేటర్లు లేవు, సీరియల్స్ లేవు.. ఇలాంటి కరవు టైమ్ లో స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లో సినిమా విడుదల చేస్తే కొత్త సినిమాల కోసం మొహం వాచిపోయిన ప్రేక్షకులకు నిజంగా పండగే. ఆ తర్వాత కొన్నిరోజులకు నేరుగా టీవీ ఛానెళ్లలో ప్రసారం చేసినా కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. అందుకే కొంతమంది టాలీవుడ్ నిర్మాతలు ఈ ఆలోచన చేస్తున్నారు. 

పెద్ద హీరోలు, పెద్ద సినిమాల విషయంలో ఇలాంటి సంచల నిర్ణయం తీసుకోకపోవచ్చు కానీ, లో బడ్జెట్ మూవీలకు మాత్రం కరోనా టైమ్ లో ఇదో మంచి ప్రత్యామ్నాయం. ఈ దిశగా ఇప్పటికే శక్తి అనే డబ్బింగ్ సినిమా (శివ కార్తికేయన్, కల్యాణి ప్రియదర్శన్) థియేటర్ల కంటే ముందు అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చేసింది. ఇదే దారిలో మరో 3 చిన్న సినిమాలు, ఇంకో 3 డబ్బింగ్ సినిమాలు కూడా డిజిటల్ మాధ్యమంలోకి రాబోతున్నాయి.

లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత.. ఇప్పటికే వాయిదా పడిన పెద్ద సినిమాలు, మే నెలలో విడుదల కావాల్సిన మరికొన్ని పెద్ద సినిమాలు థియేటర్లను కబ్జా చేయడం గ్యారెంటీ. కాబట్టి.. మరో 3 నెలల పాటు చిన్న సినిమాలకు దారి దొరికే పరిస్థితి లేదు. అప్పటివరకు కంటెంట్ ను తమ దగ్గర దాచుకుని, వడ్డీలు కట్టే స్థితిలో ఛోటా నిర్మాత ఉండడు కాబట్టి.. మధ్యేమార్గంగా ఇలా స్ట్రీమింగ్ కు ఇచ్చేస్తున్నారు. సో.. కమల్ చెప్పినట్టు ఇకపై చాలా సినిమాలు థియేట్రికల్ రిలీజ్ కంటే ముందే డిజిటల్ లో రిలీజ్ అవుతాయేమో.

నీ ఆస్థి ఐశ్వర్యం ఆంధ్ర ప్రజల బిక్ష అని మర్చిపోకు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?