సూపర్ స్టార్ మహేష్ బాబు, అనిల్ రావిపూడిల కాంబినేషన్ లో అనిల్ సుంకర నిర్మించిన సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. ఈ సినిమా డే వన్ న నాన్ బాహుబలి రికార్డు సృష్టించాలనే ప్రయత్నం కనిపిస్తోంది. తొలిరోజు మాంచి అంకెలు కనిపించేలా షో లు ప్లాన్ చేస్తున్నారు. దర్బార్ సినిమా మినహా మరొకటి థియేటర్లలో 11 నాటికి వుండదు. అందుకే 10 అర్థరాత్రి దాటిన తరువాత నుంచే షో లు పడేలా ప్లాన్ చేస్తున్నారు.
ఇలా అయితే 11న మార్నింగ్ షో పడే లోగా కనీసం మూడు షో లు వేసేయవచ్చు. ఆ తరవాత నాలుగు షో లు వుంటాయి. లేదా కనీసం టోటల్ గా ఆరు షోలు కచ్చితంగా వుంటాయి. పైగా దర్బార్ ఆడే థియేటర్లలో కూడా అర్థరాత్రి దాటిన తరువాత, తెల్ల వారు ఝామున స్పెషల్ షో లు వేసుకోవచ్చు.
డే వన్ నాన్ బాహుబలి రికార్డు రావాలంటే 40 కోట్లకు పైగా వసూళ్లు రావాలి. మహర్షికి వచ్చింది 26 కోట్లకు పైగానే. మహేష్ కు వేరే భాషలు, రాష్ట్రాల మార్కెట్ అంతగా లేదు. లేదూ అంటే సైరా, సాహో మాదిరిగా రికార్డులు వచ్చేవి. ఇప్పుడు ఆ లోటు పూడ్చడానికి మాగ్జిమమ్ థియేటర్లు, మాగ్జిమమ్ షోలు వరల్డ్ వైడ్ గా ప్లాన్ చేస్తున్నారు.
ఇదిలా వుంటే ఈ సినిమాతో పోటీగా వస్తున్న బన్నీ అల వైకుంఠపురములో మాత్రం 12న తెల్లవారు ఝామున 5 గంటల షో నుంచే ప్రారంభమవుతుంది.