Advertisement

Advertisement

indiaclicks

Home > Movies - Movie News

11న డిజె టుల్లు

11న డిజె టుల్లు

కరోనా సెకెండ్ ఫేజ్ హడావుడి తెలుగు రాష్ట్రాల్లో ఇంకా గట్టిగానే వుంది. ఆంధ్రలో యాభై శాతం ఆక్యుపెన్సీ అమలులో వుండడం, సెకెండ్ షో లేకపోవడంతో సినిమాల విడుదల హడావుడి లేకుండా పోయింది. అయితే కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయన్న వార్తలు, పైగా థర్డ్ ఫేజ్ ప్రాణాంతకం కాదన్న విషయం కలిసి మళ్లీ సినిమాల విడుదలను షురూ చేస్తున్నాయి.

ఫిబ్రవరి దాటితే మళ్లీ చిన్న, మీడియం సినిమాలకు స్పేస్ దొరకడం కష్టం కావచ్చు. అందుకే వున్న డేట్లను వాడుకోవాలనుకుంటున్నారు. ఫిబ్రవరి 11న డిజె టుల్లు విడుదల కాబోతోంది. 

సిద్దు జొన్నలగడ్డ కథ, స్క్రీన్ ప్లే అందిస్తూనే హీరోగా నటించిన సినిమా ఇది. సితార బ్యానర్ మీద నాగవంశీ నిర్మించిన ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ యూత్ ఫుల్ రొమాంటిక్ జోనర్ లో నడుస్తుంది.  

పక్కా హైదరాబాదీ యాస, స్టయిల్ తో వుండే ఈ సినిమా పాటలకు ఇప్పటికే కాస్త క్రేజ్ వచ్చింది. ఒకటి రెండు రోజుల్లో ట్రయిలర్ ను విడుదల చేయబోతున్నారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?