ఎప్పటి నుంచో ప్రభాస్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు రాధేశ్యామ్ సినిమా కోసం. వాయిదాలు పడుతూ వస్తోంది. ఆఖరికి మార్చి 11న విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి.
ఒకవేళ ఫిబ్రవరి 25న భీమ్లా నాయక్ వచ్చినా రెండు వారాలు గ్యాప్ వుండేలా ఈ డేట్ ను ఫిక్స్ చేసుకున్నారు. అదే విధాంగా బాలీవుడ్ లో రెండు వారాలు గ్యాప్ వచ్చేలా చూసుకున్నారు.
ప్రస్తుతం టాలీవుడ్ పెద్ద సినిమాలు అన్నీ ఆంధ్రలో కరోనా నిబంధనల సడలింపు కోసం చూస్తున్నాయి. సెకెండ్ షో కు అవకాశం వుంటే చాలు. అన్ని సినిమాలు రెండేసి వారాల గ్యాప్ లో క్యూ కడతాయి.
ఫిబ్రవరి 10 వ తేదీకి సినిమా టికెట్ ల రేట్ల విషయం కూడా ఒక కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు. అదే జరిగితే 25న భీమ్లా నాయక్, మార్చి 11న రాధేశ్యామ్, అదే నెల చివరిలో ఆర్ఆర్ఆర్, ఏప్రిల్ లో ఆచార్య సినిమాలు ఫిక్స్ అయిపోతాయి.
అయితే సమస్య మిడ్ రేంజ్ సినిమాలకే. వరుణ్ తేజ్ ఘని, శర్వానంద్ ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలకు సరైన డేట్ లు కావాల్సి వుంది. అలాగే మరికొన్ని సినిమాలు కూడా విడుదలకు రెడీ అవుతున్నాయి. వాటికీ డేట్ లు కావాల్సివుంది.