పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. రెండు పడవల మీద కాళ్లు అనే ఫీట్ ను సక్సెస్ ఫుల్ గా చేస్తూ వస్తున్నారు. అటు వారాహి యాత్ర, పార్టీ పనులు. ఇటు సినిమా షూటింగ్ లు. అయితే ఇప్పుడు తెలంగాణ ఎన్నికలు వచ్చాయి. పైగా తెలంగాణలో 30 కి పైగా స్థానాల్లో పోటీ చేస్తామని, పేర్లతో సహా ప్రకటించారు పవన్ కళ్యాణ్.
కానీ గమ్మత్తేమిటంటే ఎన్నికల ముందు ఇంత హడావుడి చేసిన పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రకటన తరువాత ఓ మాట లేదు. పలుకు లేదు. సింపుల్ గా మౌన వ్రతంలో వుండిపోయారు. సరే, ఇవ్వాళో, రేపో ఏదో మాట చెబుతారమో? వారాహిని తెలంగాణ వైపు తిప్పుతారేమో అనుకుంటే, ఇప్పటికే కొంత వరకు షూట్ చేసిన ఉస్తాద్ భగత్ సెట్ మీదకు వెళ్తారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ నెల 20 నుంచి షూట్ కు వెళ్లే అవకాశం వుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే తెలంగాణలో జనసేన పోటీ అన్న దాన్ని మరిచిపోవాల్సి వుంటుందేమో? ముఫై కి పైగా స్థానాలు పేర్లతో సహా ప్రకటించడం అన్న దాన్ని కూడా మరిచిపోవాల్సి వుంటుంది.
అంటే తెలుగుదేశం, వైకాపా పార్టీల మాదిరిగానే జనసేన కూడా కేవలం తెలంగాణ కు దూరంగా, ఆంధ్రకు పరమితం అయిపోతాయనే అనుకోవాలి. కానీ ఈ మాత్రం దానికి పేర్లతో సహా ముఫై కి పైగా స్థానాల్లో పోటీ చేస్తామని ఆర్భాటంగా ప్రకటించడం ఎందుకో?