Advertisement

Advertisement


Home > Movies - Movie News

2000 కోట్లు- డబ్బులు బాబూ డబ్బులు

2000 కోట్లు- డబ్బులు బాబూ డబ్బులు

టాలీవుడ్‌లోనే కాదు, అసలు సినిమా ఇండస్ట్రీలోనే క్యాష్ క్రంచ్ నడుస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో దాదాపు పెద్ద హీరోలు అందరూ పెద్ద ప్రాజెక్టులు చేపట్టారు. అవన్నీ వందల కోట్ల ప్రాజెక్ట్ లు. ఒక్కో ప్రాజెక్ట్ పట్టుకున్న నిర్మాత ఆ ప్రాజెక్ట్ మీదనే వందల కోట్లు పెట్టేసి, ఇంకా, ఇంకా డబ్బుల కోసం దిక్కులు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. అదే సమయంలో నాన్ థియేటర్ అమ్మకాలు మందగించడం, మనీ ఫ్లో తగ్గడానికి మరో కారణం అవుతోంది.

ఇలాంటి టైమ్ లో నిర్మాతలు అంతా ప్రస్తుతం చేతిలో వున్న ప్రాజెక్టులు పూర్తి చేసే పనిలో వున్నారు. కొత్త ప్రాజెక్ట్ లను అలా అలా డిస్కషన్ల పేరుతో సాగదీస్తున్నారు.

తమిళంలో భారీ సంస్థ అని, వేల కోట్ల బ్యాకింగ్ వుందని అనుకున్న ఓ సంస్థ, తను నిర్మిస్తున్న భారీ సినిమాకు డబ్బులు చాలక కిందా మీదా అవుతోంది. అందువల్ల సినిమాను అమ్మడం అన్నది పక్కన పెట్టి ఇరవై కోట్లు ఎవరు ఇస్తే వాళ్లకు డిస్ట్రిబ్యూషన్ అంటూ ఆఫర్ ఇచ్చింది. గమ్మత్తేమిటంటే ఇలాంటి ఆఫర్ ను టాలీవుడ్ లో ఎవరైనా చటుక్కున అందుకుంటారు. కానీ ఇక్కడ జనాల దగ్గర కూడా డబ్బులు లేవు. అందుకే మంచి కాంబినేషన్, డిస్ట్రిబ్యూషన్ ఆఫర్ అయినా కూడా సైలంట్ అయ్యారు.

టాలీవుడ్ లో పెద్ద సంస్థలుగా పేరున్నవి ప్రస్తుతానికి చేస్తున్న ప్రాజెక్ట్ లను పూర్తి చేద్దాం, మిగిలినవి అలా డిస్కషన్ ల్లో వుంచుదాం అనే స్టయిల్ లో ముందుకు వెళ్తున్నాయి. డైలీ మీటింగ్ లు, స్టోరీ సిటింగ్ లు, అవన్నీ మామూలే. కానీ సినిమా సెట్ మీదకు ఎప్పుడు వెళ్తుందన్నది మాత్రం చెప్పడం లేదు. ఎందుకంటే స్టార్ట్ చేస్తే ఫండ్స్ కావాలి.

టాలీవుడ్ లోని కొన్ని సంస్థలకు పొలిటికల్ మనీ ఫైనాన్స్ రూపంలో వస్తుందని టాక్ వుంది. ఇప్పుడు ఎన్నికల టైమ్ కావడంతో దగ్గర వున్నవే అర్జంట్ గా వెనక్కు సర్దుబాటు చేయాల్సిన పరిస్థితి వుంది. అలాగే ఫైనాన్స్ సంస్థలు కూడా ఇలాంటి టైమ్ లో ట్రాన్సాక్షన్లు ఆచి తూచి చేస్తున్నాయి.

ప్రస్తుతం టాలీవుడ్ లో వున్న భారీ ప్రాజెక్ట్ లు అన్నీ లెక్క పెడితే దాదాపు రెండు వేల కోట్ల రూపాయల మేరకు లెక్క తేలుతుంది. ఇంత డబ్బు విడుదల కావాల్సిన సినిమాల మీద వుండిపోయింది. ఇవన్నీ విడుదలైతే టాలీవుడ్ లోకి అంతకు అంత మొత్తం సర్క్యులేషన్ లోకి వస్తుంది. అంత వరకు ఈ ఇబ్బందులు తప్పవు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?