ఎందుకో ఆది నుంచి బ్రో సినిమాపై బజ్ తక్కువగానే ఉంది. ఫ్యాన్స్ హంగామా తప్పితే, సినిమాపై కామన్ ఆడియన్స్ లో హైప్ పెద్దగా లేదు. ఇక ఓవర్సీస్ విషయానికొస్తే, ప్రీమియర్స్ తో ఈ విషయం స్పష్టమైంది. ప్రీమియర్స్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలబడుతుందనుకున్న బ్రో సినిమా, ఆదిపురుష్ దరిదాపుల్లోకి కూడా వెళ్లలేకపోయింది.
ఈ ఏడాది ఇప్పటివరకు బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచిన చిత్రం ఆదిపురుష్. ఈ ఏడాది యూఎస్ టాప్-5 ప్రీమియర్స్ లో ప్రభాస్ సినిమాదే అగ్రస్థానం. ఈ సినిమా ప్రీమియర్స్ తోనే మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరిపోయింది.
ఇక ఆదిపురుష్ తర్వాత, ఈ ఏడాది ప్రీమియర్స్ లో 7 లక్షల డాలర్లకు పైగా వసూళ్లతో వీరసింహారెడ్డి రెండో స్థానంలో నిలిచింది. అదే టైమ్ లో రిలీజైన వాల్తేరు వీరయ్య సినిమా 6 లక్షల డాలర్లకు పైగా వసూళ్లతో మూడో స్థానంలో నిలిచింది.
ఇక పవన్ కల్యాణ్ నటించిన బ్రో సినిమా టాప్-5 ప్రీమియర్స్ లిస్ట్ లో నాలుగో స్థానంలో నిలిచింది. ఐదో స్థానంలో నాని నటించిన దసరా సినిమా ఉంది. బ్రో సినిమా, ప్రీమియర్స్ లో చిరంజీవి, బాలయ్య మూవీస్ ను కూడా క్రాస్ చేయలేకపోయింది.
ఈ ఏడాది ఇప్పటివరకు యూఎస్ఏలో టాప్-5 ప్రీమియర్స్ జాబితా ఇలా ఉంది…
ఆదిపురుష్ – $1,195,316, వీరసింహారెడ్డి – – $708,472, వాల్తేరు వీరయ్య – $679,036, బ్రో – $647,227, దసరా – $637,677