రూ.250 కోట్లు బిజినెస్.. పార్టీ లేదా పుష్పా..!

ఓవైపు ముఖ్యమంత్రి జగన్ ఎఫెక్ట్ తో ఏపీలో సినిమా బిజినెస్ డల్ అయింది. ఏకంగా ఆర్ఆర్ఆర్ నిర్మాతలే తమ మార్జిన్లు తగ్గించుకున్నారు. రాధేశ్యామ్, ఆచార్య నిర్మాతలు కూడా ప్రీ-రిలీజ్ బిజినెస్ లెక్కల్ని సవరించే పనిలో…

ఓవైపు ముఖ్యమంత్రి జగన్ ఎఫెక్ట్ తో ఏపీలో సినిమా బిజినెస్ డల్ అయింది. ఏకంగా ఆర్ఆర్ఆర్ నిర్మాతలే తమ మార్జిన్లు తగ్గించుకున్నారు. రాధేశ్యామ్, ఆచార్య నిర్మాతలు కూడా ప్రీ-రిలీజ్ బిజినెస్ లెక్కల్ని సవరించే పనిలో ఉన్నారు. మరోవైపు తెలంగాణలో ఆక్యుపెన్సీ అంతంతమాత్రంగానే ఉంది. 

పెద్ద సినిమాలకు మొదటి 3 రోజులు మినహాయిస్తే, నాలుగో రోజు నుంచి 50శాతం ఆక్యుపెన్సీ కూడా కష్టంగా మారింది. ఇలాంటి టైమ్ లో ఎక్కడ్నుంచి వచ్చిందో ఓ ప్రచారం వెల్లువలా వచ్చింది. పుష్ప సినిమా 250 కోట్ల రూపాయలు బిజినెస్ చేసిందనేది ఆ ప్రచారం.

ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో 250 కోట్ల రూపాయల బిజినెస్ అంటే మామూలు విషయం కాదు. చాలా పెద్ద మొత్తం ఇది. ఈ నంబర్ చూసి ఇండస్ట్రీ జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఓవైపు పుష్ప నిర్మాతలే 2 రోజుల కిందట స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి, టికెట్ రేట్లపై తన బాధ వ్యక్తంచేశారు. 

బిజినెస్ లెక్కలు మారుతున్నాయంటూ కెమెరా సాక్షిగా ప్రకటిస్తే, మరోవైపు ఇలా 250 కోట్ల రూపాయల బిజినెస్ అంటూ ఫీలర్లు రావడం, కేవలం పుష్పను లేపే ప్రయత్నమే తప్ప, ఇంకోటి కాదంటున్నారు చాలామంది.

అల వైకుంఠపురములో సినిమా తర్వాత బన్నీ క్రేజ్, మార్కెట్ పెరిగింది. దీన్ని ఎవ్వరూ కాదనలేరు. కానీ ఆ సినిమా సక్సెస్ తో హిందీలో పుష్ప సినిమాకు ఫ్యాన్సీ ఆఫర్లు వచ్చాయని చెప్పడం మాత్రం నమ్మశక్యంగా లేదు. 

రంగస్థలం తర్వాత సుకుమార్ చేస్తున్న సినిమా కావడంతో పుష్పపై అంచనాలు బాగా ఉన్నాయి. కానీ దీని కారణంగా కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో డిస్ట్రిబ్యూటర్లు ఎగబడి పుష్ప సినిమాను కొన్నారని చెప్పడం ఏం లాజిక్కో అర్థం కావడం లేదు.

ఓవరాల్ గా పుష్ప సినిమా థియేట్రికల్, నాన్-థియేట్రికల్ కలిపి 250 కోట్ల రూపాయల బిజినెస్ చేసిందంటూ బన్నీకి చెందిన వ్యక్తుల నుంచి ప్రచారం జరగడం, కేవలం అతడి మార్కెట్ ను పెంచే క్రమంలో వదిలిన ఫీలర్ గానే భావించాల్సి ఉంటుంది. నిజంగా ఇంత బిజినెస్ జరిగితే ఇండస్ట్రీ మొత్తానికి పుష్ప పార్టీ ఇవ్వాల్సిందే.