సైరా చూసిన ఎస్సైలు.. బదిలీ చేసిన ఎస్పీ

తెలుగు రాష్ట్రాల్లో సైరా మేనియా కొనసాగుతోంది. మొదటిరోజే సినిమా చూసేందుకు చాలామంది ఎగబడుతున్నారు. కొంతమంది ఎస్సైలు కూడా అలానే అత్యుత్సాహపడ్డారు. డ్యూటీ మరిచిపోయి మరీ సినిమా చూసేందుకు ఇంట్రెస్ట్ చూపించారు. ఫలితంగా ట్రాన్స్ ఫర్…

తెలుగు రాష్ట్రాల్లో సైరా మేనియా కొనసాగుతోంది. మొదటిరోజే సినిమా చూసేందుకు చాలామంది ఎగబడుతున్నారు. కొంతమంది ఎస్సైలు కూడా అలానే అత్యుత్సాహపడ్డారు. డ్యూటీ మరిచిపోయి మరీ సినిమా చూసేందుకు ఇంట్రెస్ట్ చూపించారు. ఫలితంగా ట్రాన్స్ ఫర్ అయ్యారు.

అవును.. కర్నూలులోని కోవెలకుంట్లలో సైరా సినిమా చూశారు ఆరుగురు ఎస్సైలు. పోలీసులు సినిమా చూడ్డంలో తప్పులేదు కానీ విధుల్లో ఉంటూ సినిమాకు వెళ్లడం మాత్రం కచ్చితంగా తప్పు. ఆ ఎస్సైలు అదే పనిచేశారు మరి. డ్యూటీలో ఉంటూనే ఉదయాన్నే సైరా సినిమా చూడ్డానికి వెళ్లారు. ఈ విషయం కాస్తా ఎస్పీ వరకు వెళ్లింది. డ్యూటీలో ఉంటూ సినిమాకు ఎలా వెళ్తారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు ఎస్పీ. బదిలీ చేస్తున్నట్టు ప్రకటించారు.

రేనాడు ప్రాంతానికి చెందిన వ్యక్తి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ప్రస్తుతం ఈ ప్రాంతం కర్నూలు జిల్లాలోనే ఉంది. అందుకే రాష్ట్రవ్యాప్తంగా సినిమాపై క్రేజ్ ఉన్నప్పటికీ, కర్నూలుజిల్లా ప్రజలు మాత్రం ఇంకాస్త ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. సదరు ఎస్సైలు కూడా అదే అత్యుత్సాహం చూపించి, ఎస్పీ ఆగ్రహానికి గురయ్యారు. ఏపీలో సైరా షోలు అర్థరాత్రి ఒంటిగంట నుంచే ప్రారంభమైన సంగతి తెలిసిందే. 

 'చిరు పనైపోయినట్టే' అని నవ్విన నోళ్లు మూతబడేలా