Advertisement

Advertisement


Home > Movies - Movie News

9న మెగా షూటింగ్ లు ‘నో’

9న మెగా షూటింగ్ లు ‘నో’

2022 జనవరిలో ఓ వార్త… హీరో వరుణ్ తేజ్ ఓ ఖరీదైన గిఫ్ట్ తో బెంగుళూరు వెళ్లబోతున్నారని, అక్కడ హీరోయిన లావణ్య త్రిపాఠీకి ప్రపోజ్ చేయబోతున్నారని. అప్పటికే ఇద్దరూ ప్రేమలో వున్నారు. పెళ్లి ప్రపోజల్ ఆ రోజే. ఆ వార్త అదే రోజు ఉదయం బయటకు రావడంతో కాస్త కలవరం పుట్టింది. 

హీరో వైపు సన్నిహితులు కొందరు ఫోన్ చేసి, నిజమే కానీ, ప్రస్తుతానికి వెల్లడి చేయ వద్దని రిక్వెస్ట్ చేయడం మొదలైంది. కట్ చేస్తే, ఆ తరువాత నుంచి ఈ జంట ప్రేమ..పెళ్లి తరచు వార్తల్లో వుంటూనే వస్తోంది. 

మెగా ఇంట్లో జరిగే కార్యక్రమాల్లో, బయట వ్యక్తి ఎవరైనా కనిపించారు అంటే అది లావణ్య కావడం జనం గమనిస్తూనే వచ్చారు. హీరో పేరెంట్స్ కూడా దాదాపు ఈ పెళ్లికి ఓకె అన్నారని ఇటీవల వార్తలు వినిపించాయి.

ఇప్పుడు ఆఖరికి ఫైనల్ అయింది. ఈ నెల 9న ఈ జంట నిశ్చితార్థం అన్న వార్త బయటకు వచ్చింది. ఆ రోజు మెగా హీరోల సినిమా షూటింగ్ లు ఏవీ వుండకుండా ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటున్నారు. 

మెగా ఫ్యామిలీలో ఈవెంట్ కనుక కచ్చితంగా అందరూ వుండాల్సిందే. మొత్తానికి 19 జనవరి 2022 న బయటకు వచ్చిన వార్త ఇప్పటికి పెళ్లి పీటల దిశగా వెళ్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?