వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌వర్మ ఏం చేసినా ప్రత్యేకతే. మరీ ముఖ్యంగా వర్మ ట్వీట్ చేశారంటే దాని గురించి సీరియస్‌గా ఆలోచించాల్సిందే. వివాదాస్పద అంశాలను నెత్తికెత్తుకోవడం ఆయన స్పెషాల్టీ. తాజాగా ఆయన అక్కచెల్లెళ్లపై స్పందించిన తీరు ప్రతి ఒక్కర్నీ ఆలోచింపజేసేలా ఉంది.
ఇటీవల మధ్యప్రదేశ్‌లో ఇద్దరు గిరిజన అక్కాచెల్లెళ్లను కుటుంబ సభ్యులే అత్యంత పాశవికంగా చంపడం యావత్ దేశాన్ని షాక్‌కు గురి చేసింది.
మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లా పిపల్వ గ్రామానికి చెందిన గిరిజన అక్కాచెల్లెళ్లు తమ మేనమామ కుమారులతో కొంత కాలంగా ఫోన్‌లో మాట్లాడుతున్నారని కుటుంబ సభ్యులు ఆగ్రహానికి గురయ్యారు. గత నెల 22న అక్కచెల్లెళ్ల జుట్టు పట్టుకుని ఈడ్చుతూ కర్రలతో కుటుంబ సభ్యులే చితక్కొట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ ఘటనపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌వర్మ ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఆయన తన ఆవేదనను, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ దారుణాన్ని తాను నమ్మలేకపోతున్నట్టు చెప్పుకొచ్చారు. దాడికి పాల్పడిన వాళ్లందరికీ తగిన శిక్ష వేయకపోతే, తనకు ఈ దేశంపై ఉన్న నమ్మకం పోతుందని ఆవేదనతో తెలిపారు.