ప్రపంచంలో ఒక మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు అని వింటూ ఉంటాం. గతంలో చాలాసార్లు కొందరిని మన కళ్ళతో కన్నాం కూడా, అది వేరే విషయం అనుకోండి! కానీ ఇప్పుడు అదే విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వెలుగులోకి వచ్చిన బాలీవుడ్ తార మరి ఎవరో కాదు దీపికా పదుకొనే.
ఇంతకు మునుపు చెప్పుకున్న విధంగా టిక్ టాక్ ద్వారా ధనుష్, ప్రభాస్, మహేష్ బాబు లాంటి వారు చాలా దగ్గరి పోలికలతో వారి వీడియోలతో చాలా మందిని ఆశ్చర్యం కలిగించి ప్రజాధారణను సొంతం చేసుకున్నారు. ఇప్పుడు అదే కోవలోకి చేరింది రిజుతా ఘోష్. ఈవిడ సినీ పరిశ్రమకు చెందకపోయినా.. ఆ స్థాయిలోనే ఫాలోవర్స్ ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఈమె కలకత్తాకు చెందిన డిజిటల్ క్రియేటర్. 2015 వ సంవత్సరం ఇన్‌స్టాగ్రామ్ మాధ్యమాన్ని ఎంపిక చేసుకొని తన వృత్తిపరమైనటువంటి విషయాలు పోస్ట్ చేస్తూ వాటి గురించిన వివరాలు వివరిస్తూ ఉండేవారు.
క్రమక్రమంగా తన వ్యక్తిగతమైనటువంటి ఫోజులతో ఫోటోలను షేర్ చేస్తున్నారు. వాటిలో కొన్ని నటి దీపికను పోలినట్టుగా ఉండడంతో నెటిజన్ల ఫాలోయింగ్ కాస్త పెరిగింది. ఈమె ఎవరో తెలుసుకుందామని ప్రొఫైల్ ను తెరిచి చూసిన వీక్షకులు తన పోలికలను చూసి ఆశ్చర్యానికి, సంబర వాత్సల్యానికి లోనవుతున్నారు.
మీరు దీపిక సిస్టరా? అని ప్రశ్నలు వేస్తూ.. దీపికా 2.0 అంటూ పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం రిజుతా ని ఫాలో అవుతున్న వారి సంఖ్య దాదాపు 50 వేల మంది అని చెప్పుకోవాలి.