టాలీవుడ్ హీరోలు, దర్శకుల రెమ్యూనిరేషన్లు తగ్గించే ప్రయత్నం చేస్తోంది యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్. అందులో భాగంగా అయిదుగురు నిర్మాతలతో కమిటీ వేసింది. కానీ విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం ఈ కమిటీ టాప్ 6 హీరోల జోలికి పోదని తెలుస్తోంది.
ఇంతకీ టాప్ 6 ఎవరయ్యా అంటే ప్రభాస్, బన్నీ, మహేష్ బాబు, ఎన్టీఆర్, చరణ్, పవన్ కళ్యాణ్ అని తెలుస్తోంది. మరి మెగాస్టార్ ఈ జాబితాలో ఎందుకు లేరో తెలియదు. లేదా ఆయన రెమ్యూనిరేషన్ వీళ్ల కన్నా తక్కువేమో అంతకన్నా తెలియదు.
గిల్డ్ టార్గెట్ టైర్ 2 హీరోలే అని వినిపిస్తోంది. ముఖ్యంగా నాని, రవితేజ, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, నాగ్ చైతన్య ఇలా వుంది జాబితా అని వినిపిస్తోంది. ఎందుకంటే రవితేజ 18 కోట్లు,నాని 15 కోట్లు, సాయి ధరమ్ తేజ్ 8 కోట్లు ఇలా సాగుతోంది రెమ్యూనిరేషన్ల లెక్క అని వినిపిస్తోంది. ముందు వీటిని తగ్గించాలనుకుంటున్నారట.
అలాగే దర్ళకుల విషయంలో కూడా టాప్ డైరక్టర్ల గురించి డిస్కస్ చేయరు అని తెలుస్తోంది. త్రివిక్రమ్, రాజమౌళి వగైరా, ఇలా పెద్ద డైరక్టర్లన్నమాట. అంటే గిల్డ్ కమిటిలో వున్నవారంతా పెద్ద హీరోలతో సినిమాలు నిర్మించేవారే ఎక్కువ. వీళ్లంతా పెద్ద హీరోల దగ్గరకు వెళ్లకుండా టైర్ 2 హీరోలను కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తారన్నమాట.
కానీ నిజానికి మరోపక్కన ఇదంతా జస్ట్ హడావుడే అని. సినిమా తీసేటపుడు మళ్లీ ఎలా ఇచ్చేవి అలా హీరోలకు అందేస్తాయని, దానా దీనా కంట్రోల్ చేసేదంతా చిన్న హీరోలు, సీనియర్ క్యారెక్టర్ యాక్టర్లు వీళ్లనే అని గుసగుసలు వినిపిస్తున్నాయి.