Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఆ సినిమా అలాగే వుంది

ఆ సినిమా అలాగే వుంది

నిర్మాత దిల్ రాజు- మైత్రీ సంస్థ మాట్లాడుకుని ఓ భారీ సినిమాను ఇటు నుంచి అటు మార్చుకున్నారు. ఆ విధంగా విజయ్ దేవరకొండతో ఓ భారీ సినిమా దిల్ రాజు కాంపౌండ్ లోకి వచ్చింది. కానీ ఆ సినిమా ఇప్పటి వరకు మెటీరియలైజ్ కాలేదు. ఈ లోగా పరుశురామ్ దర్శకత్వంలో ఫ్యామిలీ స్టార్ సినిమాను విజయ్ చేసేసారు.

మరి ఇంతకీ ఆ భారీ ప్రాజెక్ట్ ఏమైంది? ఇదే ప్రశ్నను ఫ్యామిలీ స్టార్ క్యూ అండ్ ఎ కార్యక్రమంలో అడిగితే, ‘ఆ ప్రాజెక్ట్ అలాగే వుంది. అది పాన్ ఇండియా భారీ సినిమా. దానికి నిర్మాతగా నేను కూడా తగిన సమయం కేటాయించాలి. బౌండ్ స్క్రిప్ట్ రెడీగా వుంది. ఎప్పటికైనా తెరకెక్కిస్తాను’ అన్నారు దిల్ రాజు.

ఇలాంటి సినిమా, ఫలానా జానర్ చేయాలని తాను అనుకోనని, చేస్తున్న సినిమాకు భిన్నంగా రాబోయే వుండాలని కోరుకుంటా అని విజయ్ దేవరకొండ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పరుశురామ్ తనతో సినిమా చేయాలని వచ్చినపుడు చెప్పిన పాయింట్ నచ్చి, ఫుల్ నేరేషన్ అడిగానని వివరించారు. ముఖ్యంగా హీరో పాత్రలో తన తండ్రిని ఐడెంటిఫై చేసుకున్నానని, అందుకే ఆ పాత్రకు తన తండ్రి పేరు అయిన గోవర్దన్ అనే పేరు పెట్టమని రిక్వెస్ట్ చేసానని వివరించారు.

సినిమా దర్శకత్వం అంటే చాలా విషయాలు వుంటాయని, అందువల్లే అవన్నీ పూర్తిగా అనుభవంలోకి రాని కొత్త దర్శకులతో కాకుండా, కనీసం ఒక్క సినిమా అయినా చేసిన దర్శకుడు ఎవరైనా, మంచి కథ తెస్తే చేయడానికి సిద్దమని విజయ్ వివరించారు. ఇంటిపేరు అన్నది ఓ బాధ్యత అని, దానికి ప్రతి ఒక్కరూ తమ వంతు క్రెడిట్ యాడ్ చేస్తూ వెళ్లాలని విజయ్ అభిప్రాయపడ్తారు.

కోవిడ్ టైమ్ లో విజయ్ తనకు డబ్బులు అవసరం పడి, ఫోన్ చేసి అడిగితే అడ్వాన్స్ పంపానని, ఇలా హీరోలకు అడ్వాన్స్ ఇవ్వడం అన్నది తనకు ఇదే తొలిసారి అని నిర్మాత దిల్ రాజు అన్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?