సాధారణంగా ఓ సినిమాకు ఓ హీరోను స్పెషల్ క్యారెక్టర్ తీసుకున్నాక వెనకడుగు వేయరు. ఎందుకంటే స్పెషల్ క్యారెక్టర్లు వెయడానికి హీరోలను ఒప్పించడమే కష్టం కనుక. కానీ అలా ఒప్పించి కూడా తప్పించారు అంటే సమ్ థింగ్..సమ్ థింగ్ అనుకోవాలేమో? దర్శకుడు శ్రీవాస్-హీరో గోపీచంద్ కాంబినేషన్ లో ఓ సినిమా మొదలైంది. ఆ ఇద్దరి కాంబినేషన్ లో ఇది ముచ్చటగా మూడో సినిమా.
ఈ సినిమాలో కీలకపాత్ర కోసం సీనియర్ హీరో రాజశేఖర్ ను తీసుకున్నారు. కానీ ఇప్పుడు వినిపిస్తున్న వార్తలు ఏమిటంటే ఆ ప్రాజెక్టు నుంచి రాజశేఖర్ తప్పుకున్నారనో లేదా వీళ్లే వద్దనుకున్నారనో. మొత్తం మీద అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్టుకు ఆ ప్రత్యేక పాత్ర కోసం మరో మాంచి నటుడు కావాల్సి వుంది.
రాజశేఖర్ ఆ సినిమా నుంచి తప్పుకోవడానికి లేదా తప్పించడానికి కారణాలు తెలియడం లేదు. క్యారెక్టర్, దానికి సంబంధించిన విషయాల్లో రాజశేఖర్ భార్య జీవిత జోక్యం కారణం అని ఓ గ్యాసిప్ వినిపిస్తోంది.
ఎంత వరకు నిజం అన్నది తెలియాలి. మొత్తం మీద ఇప్పుడు ఆ ప్రాజెక్టు మరో మాంచి నటుడి కోసం వెదుకులాడుతోంది. ఇలాంటి క్యారెక్టర్లకు జగపతి బాబు బెటర్ ఆప్షన్ గా వుండనే వున్నారు కదా?