ఆ రెండు సినిమాలు బాగుంటాయి

సామజ‌వరగమన..ఊరి పేరు భైరవ కోన. ఈ రెండు సినిమాల నిర్మాత ఒక్కరే. రాజేష్ దండా. ఈ రెండు సినిమాల గురించి నిర్మాత రాజేష్ మీడియాతో మాట్లాడారు. ’సామజవరగమనా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. శ్రీ…

సామజ‌వరగమన..ఊరి పేరు భైరవ కోన. ఈ రెండు సినిమాల నిర్మాత ఒక్కరే. రాజేష్ దండా. ఈ రెండు సినిమాల గురించి నిర్మాత రాజేష్ మీడియాతో మాట్లాడారు. ’సామజవరగమనా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. శ్రీ విష్ణు ఇంతవరకూ చేయని జోనర్. సమ్మర్ విడుదలకు ప్లాన్ చేస్తున్నాం. సందీప్ కిషన్ ‘ఊరు పేరు భైరవకోన’ చాలా పెద్ద స్కేల్ లో సూపర్ నేచురల్ ఫాంటసీగా చేస్తున్నాం. ఇందులో గ్రాండ్ విజువల్స్, మంచి ఫన్, పాటలతో పాటు అన్నీ కమర్షియల్ ఎలిమెంట్స్ వుంటాయి. జులై లేదా ఆగస్ట్ లో విడుదలకు ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు నిర్మాత రాజేష్ దండా.

సందీప్ కిషన్ కథానాయకుడిగా. వి.ఐ.ఆనంద్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఊరు పేరు భైరవకోన, శ్రీవిష్ణు కథానాయకుడిగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన సామజవరగమన చిత్రాలని హాస్య మూవీస్ బ్యానర్ పై అనిల్ సుంకర సమర్పణ లో నిర్మిస్తున్నారు రాజేష్ దండా.

స్వామిరారా చిత్రంతో డిస్ట్రిబ్యూటర్ గా మొదలుపెట్టి దాదాపు 82 చిత్రాలు డిస్ట్రిబ్యూటర్ గా చేశాను. కేరాఫ్ సూర్య సినిమాకి కో ప్రొడ్యూసర్ గా చేశాను. తర్వాత ఒక్క క్షణం, నాంది సినిమాలకి కో ప్రొడ్యూసర్ గా చేశాను. మేము మొదట స్టార్ట్ చేసిన చిత్రం ఊరు పేరు భైరవకోన. కొన్ని కారణాల వలన అది ఆలస్యమైయింది. దీంతో ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం ముందు విడుదలైయింది. కమర్షియల్ సక్సెస్ మాట పక్కన పెడితే మంచి సినిమా తీశాననే పేరు తీసుకొచ్చింది ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం. ఓటీటీలో ఇది పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది.

‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’.. ఆ ఊరి కథ. దీంతో అదే టైటిల్ యాప్ట్. సందీప్ కిషన్ గారి ‘ఊరు పేరు భైరవ కోన’ సినిమా చూస్తే ఆ టైటిల్ ఎందుకు పెట్టామో అర్ధమౌతుంది. దానికి మంచి లింక్ వుంటుంది. సామజవరగమన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్.