Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఫ్యాన్స్ కు పండగ వుంటుందా?

ఫ్యాన్స్ కు పండగ వుంటుందా?

అందరికీ ఉగాది కావచ్చు. కానీ అభిమానులకు మాత్రం తమ హీరోలు చేస్తున్న సినిమాల నుంచి మంచి అప్ డేట్ వచ్చిన రోజే అసలైన పండగ. ఈ ఉగాదికి అలాంటి ఎదురు చూపులు చాలా వున్నాయి. ప్రభాస్ ఫ్యాన్స్ అందరికన్నా ఎక్కువ ఎదురు చూపులు చూస్తున్నారు. ఆదిపురుష్, సలార్ సినిమాల సంగతులు ఏమీ తెలియక ప్రభాస్ ఫ్యాన్స్ విలవిల లాడుతున్నారు. అవి వస్తాయా? వస్తే ఎప్పుడు వస్తాయి? ఇలా చాలా చాలా తెలియాల్సి వుంది. అలాంటి అప్ డేట్ ఏమైనా ఉగాది నాడు వస్తుందేమో అన్న చిన్న ఆశ. మారుతి తో చేస్తున్న సినిమా అనౌన్స్ మెంట్ కూడా వస్తుందేమో అన్న కోరిక వుంది కానీ నెరవేరకపోవచ్చు.

ఇక రామ్ చరణ్ ఫ్యాన్స్ కు కూడా అలాంటి ఆశ వుంది. శంకర్ డైరక్షన్ లో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా టైటిల్ రావాల్సి వుంది. అది ఉగాదికి వస్తుందా? బర్త్ డే కు వస్తుందా అన్న ఎదురు చూపులు వుండనే వున్నాయి.

మహేష్ బాబు-త్రివిక్రమ్ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ లాంటి కోరికలు ఫ్యాన్స్ కు వున్నాయి. ఉగాదికి ఏదైనా వీడియో లేదా టైటిల్ వదులుతారేమో అన్న ఆశ వుంది. కానీ ఇలాంటి క్రేజీ ప్రాజెక్టు కు టైటిల్ దొరకడం అంత సులువు కాదు. అందులోనూ త్రివిక్రమ్ స్టయిల్ లో. అందువల్ల టైటిల్ రావడం కష్టం కావచ్చు. కానీ పోస్టర్, వీడియో లాంటివి ఏమైనా వస్తే ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతారు.

ఇక అసలు సిసలు సినిమా బన్నీ - సుకుమార్ కాంబో పుష్ప2. ఈ సినిమా నుంచి ఏం అప్ డేట్ వస్తుందన్ననది చూడాలి. పోస్టర్ ఏమైనా ఉగాది శుభాకాంక్షలతో అని వస్తే, దాని మీద మాంచి బన్నీ స్టిల్ వుంటే ఇక ఫ్యాన్స్ కు పూనకాలే. ఈ సినిమా విడుదల డేట్ చాలా దూరంగా వున్నందున ఇప్పుడు అయితే టీజ‌ర్ లాంటి పెద్ద ఎక్స్ పెక్టేషన్స్ పనికిరావు. లుక్ లాంటిది ఓకె.

పవన్ కళ్యాణ్ సినిమాలు రెండు మూడు సెట్ మీద వున్నాయి. ఏ ఒక్క దాని నుంచి అప్ డేట్ అనేది పోస్టర్ నో, వీడియోనో వస్తే పవర్ స్టార్ అభిమానులకు పండగే పండగ. ముఖ్యంగా హరి హర వీర మల్లు పరిస్థితి ఏమిటి? పీపుల్స్ మీడియా నిర్మించే సినిమా విడుదల డేట్ ఇలాంటి కోరికలు చాలా వున్నాయి.

విజ‌య్ దేవరకొండ-గౌతమ్ తిన్ననూరి సినిమా అనౌన్స్ మెంట్ వచ్చింది కనుక. ఇక రావాల్సిన అప్ డేట్ ఒకటే సినిమా ఎప్పుడు సెట్ మీదకు వెళ్తుందనేది.

ఇక చాలా సినిమాల నుంచి పోస్టర్లు, లుక్ లు ఎలాగూ వస్తాయి. కానీ అభిమానులకు పండగ కావాలంటే టాప్ హీరోల సినిమా ల యూనిట్ లు కదలాల్సి వుంటుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?