ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ప్రధాన ప్రతిపక్షం టీడీపీ బాగా ఇరిటేట్ చేస్తోంది. పులివెందులలో ఓడిస్తామంటూ టీడీపీ మైండ్‌గేమ్‌కు తెరలేపింది. ఈ పరిణామాలకు దారి తీసిన ఎన్నికల ఫలితాలేంటో అందరికీ తెలుసు. వై నాట్ పులివెందుల అంటూ టీడీపీ పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తోంది. గతంలో కుప్పంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం చెందడంతో వైసీపీ ఓ ఆట ఆడుకుంది.
ఇప్పుడు టీడీపీ రివర్స్ గేమ్ ఆడుతోంది. అయితే సీఎం జగన్‌పై ఈగ వాలినా మంత్రి రోజా రియాక్ట్ అయ్యే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అసెంబ్లీ వేదికగా రోజా తనదైన పంచ్‌లతో ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. పులివెందుల్లో జగన్‌కు ఎదురు గాలి వీస్తోందన్న ప్రచారాన్ని రోజా దీటుగా తిప్పికొట్టారు. టీడీపీకి దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని రోజా డిమాండ్ చేశారు. చంద్రబాబు, బాలకృష్ణ, అచ్చెన్నాయుడు తమ పదవులకు రాజీనామా చేసి ఎన్నికలకు వస్తారా? అని రోజా సవాల్ విసిరారు.
పులివెందులలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఓడించే మగాడు పుట్టలేదని ఆమె ఘాటుగా టీడీపీకి కౌంటర్ ఇచ్చారు. వైసీపీ దెబ్బ ఎలా వుంటుందో గత సార్వత్రిక ఎన్నికల్లో చూపినట్టు రోజా గుర్తు చేశారు. మళ్లీ 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ దెబ్బేంటో రుచి చూపుతామని వార్నింగ్ ఇచ్చారు.
ఏడేళ్లుగా టీడీపీ సైకిల్ గుర్తుపై గెలిచిన దాఖలాలు లేవని దెప్పి పొడిచారు. టీడీపీకి అంత నమ్ముకం ఉంటే లోకేశ్‌ను ఎందుకు పోటీలో పెట్టలేదని రోజా ప్రశ్నించారు. తాము గెలిస్తే డబ్బులతో అంటారని, టీడీపీ విజయం సాధిస్తే మాత్రమే ప్రజాతీర్పు అంటారని రోజా ఎద్దేవా చేశారు.