మోస్ట్ అవైటింగ్ ఫ్యామిలీ మూవీ అనేలా బజ్ తెచ్చుకుంటున్న ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా ట్రయిలర్ విడుదలయింది. ఇప్పటికే కంటెంట్ ఎలా వుండబోతోంది అన్నది క్లారిటీ వచ్చింది బయటకు వచ్చిన పాటలు, పబ్లిసిటీ మెటీరియల్ తో.
ఇప్పుడు అదే విషయాన్ని ట్రయిలర్ మరింత క్లారిటీగా చెప్పింది. బోలెడు మంది నడివయసు ఆడవాళ్ల అభిప్రాయాల మధ్య చిక్కుకుంటుంది శర్వానంద్ పెళ్లి. పండగ కావాల్సిన పెళ్లి కాస్తా ఫన్ గా మారిపోతుంది.
ఇలాంటి నేపథ్యంలో రష్మిక తో ప్రేమ ముడిపడుతుంది. ఆమె తల్లి కూడా ఓ నడివయసు మహిళే కదా..ఈ నడివయసు మహిళల నోటికి తాళం పడేలా వుంది ఆమె వ్యవహారం.
పాపం వీటన్నింటి మధ్య చిక్కకున్న శర్వా ప్రేమ కథ ఎలా కంచికి చేరిందో ట్రయిలర్ చూస్తే తెలియదు. సినిమా చూడాల్సిందే.
కరోనా టైమ్ లో ఎగ్ఙామ్ రాయకుండా పాసైపోయి, నన్ను ఇప్పుడు ఎగ్ఙామ్ రాయమంటారా? అనే ఫన్ డైలాగు మాత్రమే కాదు, లైట్ ఎమోషనల్ డైలాగులు కూడా ట్రయిలర్ లో దొర్లాయి. దేవీ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు నిర్మాత సుధాకర్ చెరుకూరి.