Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఓటీటీలోకి అడుగుపెడుతున్న మరో హీరో

ఓటీటీలోకి అడుగుపెడుతున్న మరో హీరో

ఇప్పటికే కొంతమంది హీరోలు ఓటీటీలోకి అడుగుపెట్టారు. నాగచైతన్య ఓ వెబ్ డ్రామాలో నటిస్తున్నాడు. తాజాగా షూటింగ్ కూడా పూర్తిచేశాడు. అలానే రానా-వెంకీ కలిసి మరో వెబ్ డ్రామా చేస్తున్నారు. వీళ్లు కాకుండా చాలామంది చిన్న హీరోలు ఓటీటీలోకి ఆల్రెడీ అడుగుపెట్టారు. ఇప్పుడీ లిస్ట్ లోకి మరో హీరో చేరబోతున్నాడు.

త్వరలోనే ఓటీటీ స్పేస్ లోకి అడుగుపెట్టబోతున్నాడు హీరో ఆది సాయికుమార్. ఓటీటీ ఎంట్రీ కోసం చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్న ఈ నటుడు, ఓ మంచి స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఆ ప్రాజెక్టు దాదాపు 90శాతం ఓకే అయిపోయిందని, అదే తన ఓటీటీ డెబ్యూ అవుతుందని చెబుతున్నాడు. అతి త్వరలో తన ఓటీటీ ఎంట్రీకి సంబంధించి ప్రకటన చేస్తానంటున్నాడు ఈ హీరో.

మరోవైపు ప్రత్యేక పాత్రలు, కీలక పాత్రలపై కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు ఈ హీరో. ప్రస్తుతం తనను నమ్మి కొంతమంది నిర్మాతలు డబ్బులు పెడుతున్నారని, ఇలాంటి టైమ్ లో తను మరో హీరో సినిమాలో ప్రత్యేక పాత్రలు, కీలక పాత్రలు లాంటివి చేస్తే.. ఆ నిర్మాతలకు ఇబ్బంది కలుగుతుందని అభిప్రాయపడ్డాడు.

తను హీరోగా కొనసాగుతున్నానని, తన స్థాయికి తగ్గని రేంజ్ లో ఇతర సినిమాల్లో పాత్రలు ఉంటే అప్పుడు కచ్చితంగా ఆలోచిస్తానంటున్నాడు. నిజానికి అలాంటి పాత్రలతో తనను ఎవ్వరూ సంప్రదించలేదని, అందరూ తనను హీరోగానే చూస్తున్నారని అన్నాడు ఆదిసాయికుమార్. ఇతడు నటించిన బ్లాక్ సినిమా త్వరలోనే థియేటర్లలోకి రాబోతోంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?