ఆదిత్య మ్యూజిక్ కు ఆ పాట చాలు

డిజిటల్ కంటెంట్ రైట్స్ కొనడం అంటే ఏసి డీసీ ఆడడమే.కాస్త రిస్కే. అయినా అదే వ్యాపారం లో వుంటే తప్పదు. ఆదిత్య మ్యూజిక్ సంస్థ అడియో డిజిటల్ రైట్స్, విడియో సాంగ్స్ రైట్స్ కొంటుందన్న…

డిజిటల్ కంటెంట్ రైట్స్ కొనడం అంటే ఏసి డీసీ ఆడడమే.కాస్త రిస్కే. అయినా అదే వ్యాపారం లో వుంటే తప్పదు. ఆదిత్య మ్యూజిక్ సంస్థ అడియో డిజిటల్ రైట్స్, విడియో సాంగ్స్ రైట్స్ కొంటుందన్న సంగతి తెలిసిందే. ఆ విధంగానే అల వైకుంఠపురములో సినిమా అడియో, విడియో సాంగ్స్, పబ్లిసిటీ కంటెంట్ హక్కులు దగ్గర దగ్గర మూడు కోట్లు చెల్లించి తీసుకుంది. ఇప్పుడు ఆ సంస్థ పంట పండింది. టోటల్ లాంగ్ రన్ లో ఒక్క 'సామజవరగమన' పాటనే కోటిన్నరకు పైగా చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా కడుతున్నాయి.

ఈపాట ఇప్పటికే అన్ని రకాల ఫ్లాట్ ఫారమ్ లు కలుపుకుని 100 మిలియన్ల హిట్ లు సాధించింది. ఇంకా ఈ పాట ఫుల్ విడియో రావాల్సి వుంది. అదెంత వైరల్ అవుతుందో తెలియదు. అందువల్ల టోటల్ రన్ లో ఈ ఒక్క పాట మీదే కోటిన్నర వరకు ఆదిత్య మ్యూజిక్ కు ఆన్ లైన్ ఇన్ కమ్ వస్తుందని అంచనా వేస్తున్నారు.

ఇది కాక అదే సినిమాలో రెండో పాట 'రాములో రాములు' కూడా బాగానే వైరల్ అయింది. ఇప్పటికి యాభై మిలియన్ల హిట్ వరకు సాధించింది. అందువల్ల ఈ రెండు పాటలు, వీటి విడియో కంటెంట్ లు బట్టే ఆదిత్యకు పెట్టుబఢి వెనక్కు వస్తుందని అంచనా. 

ఇవి కాక ఇంకా చాలా కంటెంట్, చాలా పాటలు రావాల్సి వుంది. మూడుకోట్ల పెట్టుబడికి మంచి లాభాలే వచ్చేలా వున్నాయి.