ఆశిష్ ను ఆశీర్వదించారు..థాంక్స్

నిర్మాత దిల్ రాజు సోదరుడు శిరీష్ తనయుడు ఆశిష్ హీరోగా తయారై విడుదలయిన సినిమా రౌడీ బాయ్స్. శ్రీహర్ష దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమా సక్సెస్ మీట్ ఈసాయంత్రం జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత…

నిర్మాత దిల్ రాజు సోదరుడు శిరీష్ తనయుడు ఆశిష్ హీరోగా తయారై విడుదలయిన సినిమా రౌడీ బాయ్స్. శ్రీహర్ష దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమా సక్సెస్ మీట్ ఈసాయంత్రం జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ ‘‘‘రౌడీ బాయ్స్’ సినిమాను యూత్‌ఫుల్ కంటెంట్‌తో తెర‌కెక్కించామ‌ని ముందు నుంచి చెబుతూ వ‌చ్చాను. 

ఇప్పుడు ‘రౌడీ బాయ్స్’ సంధ్య థియేట‌ర్‌లో, ప్ర‌సాద్ ఐ మ్యాక్స్‌లో చూశాను. ప్ర‌తి సీన్‌ను ఆడియెన్స్‌ను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా సెకండాఫ్‌లో సాంగ్స్ వ‌చ్చే సీన్‌లో ఆడియెన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా మ్యూజికల్‌గానీ, డాన్సుల ప‌రంగా కానీ ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది. ఓ న్యూ హీరో సినిమాను బావుంద‌ని అన‌డం చాలా ఆనందంగా ఉంది. మా బ్యాన‌ర్ ద్వారా హీరోగా ప‌రిచ‌యం అయిన ఆశిష్‌ను ఆశీర్వ‌దించి యాక్సెప్ట్ చేసినందుకు అంద‌రికీ చాలా చాలా థాంక్స్ అన్నారు. 

ద‌ర్శ‌కుడు శ్రీహ‌ర్ష కొనుగంటి మాట్లాడుతూ ‘‘ఇది చాలా ఎమోష‌న‌ల్ మూమెంట్‌. నా తొలి సినిమా హుషారు వ‌చ్చి మూడేళ్లు అవుతుంది. ఈ సినిమాను స్టార్ట్ చేసేట‌ప్పుడు ఇంత పెద్ద‌గా అనుకోలేదు. కానీ పెద్ద పెద్ద టెక్నీషియ‌న్స యాడ్ కావ‌డంతో సినిమా విజువ‌ల్‌గా బ్యూటీఫుల్‌గా వ‌చ్చింది. ముందు దిల్ రాజుకు థాంక్స్ చెప్పాలి. ఇన్నేళ్ల క‌ష్టానికి ఇప్పుడు రిలీఫ్ దొరికిన‌ట్లు అయ్యింది. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ అయితే, ప్రీమియ‌ర్ చూసి ఏడ్చేసింది. బాగా తీశాన‌ని అంటున్నారు. ఆశిష్ తొలి సినిమా హీరోలా అనిపించ‌లేద‌ని అంటున్నారు. అంద‌రికీ థాంక్స్‌’’ అన్నారు. 

హీరో ఆశిష్ మాట్లాడుతూ ‘‘హీరోగా నన్ను యాక్సెప్ట్ చేసినందుకు తెలుగు ప్రేక్షకుల‌కు థాంక్స్‌. మీరు ఏదైతే న‌మ్మ‌కంతో నేను బాగా చేశాన‌ని అన్నారో. దాని కోసం ఇంకా మంచి సినిమాలు చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తాను. డైరెక్ట‌ర్ శ్రీహ‌ర్ష‌కు థాంక్స్‌. అనుప‌మ టెరిఫిక్ పెర్ఫామెన్స్ ఇచ్చింది. ఇంత మంచి స‌పోర్ట్ అందించిన అనుప‌మ‌కు థాంక్స్‌. ప్రేక్ష‌కుల‌కు, సపోర్ట్ చేసిన వారికి లైఫ్ లాంగ్ రుణ‌ప‌డి ఉంటాం. దేవిశ్రీ అన్న‌.. అద్భుత‌మైన సంగీతాన్ని అందించారు. మ‌దిగారు ప్ర‌తి షాట్‌లో ఎంతో అద్భుతంగా చూపించారు. ఎంటైర్ ‘రౌడీ బాయ్స్’ టీమ్ థాంక్స్‌’’ అన్నారు.