ఎఎఎస్… పూర్ మాన్స్ ఏజెంట్

చంటబ్బాయిని చూసారు. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ నూ చూసారు. ఇలాంటి సినిమాలు చూసిన కళ్లతో, ఎఎఎస్…అనబడే ఏజెంట్ ఆనంద్ సంతోష్ ను చూస్తే ఎలా వుంటుంది? రాజును చూసిన కళ్లతో మొగుడ్ని చూసినట్లుంది. …

చంటబ్బాయిని చూసారు. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ నూ చూసారు. ఇలాంటి సినిమాలు చూసిన కళ్లతో, ఎఎఎస్…అనబడే ఏజెంట్ ఆనంద్ సంతోష్ ను చూస్తే ఎలా వుంటుంది? రాజును చూసిన కళ్లతో మొగుడ్ని చూసినట్లుంది. 

ఆహా లో ప్రారంభం కాబోతున్న కొత్త వెబ్ సిరీస్..ఎఎఎస్..అలియాస్ ఏజెంట్ ఆనంద్ సంతోష్. ఈ పది భాగాల వెబ్ సిరీస్ ట్రయిలర్ ను ఈ రోజు విడుదల చేసారు.

గతంలో కొన్ని చిన్న సినిమాలు అందించిన దర్శకుడు అరుణ్ పవార్ ఈ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించారు. సుబ్బు కె రచన అందించారు. అరవైలు దాటేసిన కొంత మంది కలిపి ప్రారంభించిన ఓ డిటెక్టివ్ ఏజెన్సీ. 

పెద్ద డిటెక్టివ్ కావాలనే ఉత్సాహంతో అందులో చేరిన హీరో. అనుకోకుండా ఓ చిక్కులో చిక్కుకోవడం ఇలాంటి రెగ్యలర్ కాన్సెప్ట్ తోనే సిరీస్ ను రూపొందించినట్లు కనిపిస్తోంది.

యూట్యూబ్ లో క్రేజ్ సంపాదించుకున్న బిగ్ బాస్ పార్టిసిపెంట్ షణ్ముఖ్ ఏజెంట్ ఆనంద్ సంతోష్ గా నటించాడు. ట్రయిలర్ వరకు చూస్తే కొత్తగానూ లేదు. కొత్తగా లేకపోవడం అన్నది మాత్రమే సమస్య కాదు. మెయిన్ స్ట్రీమ్ మూవీస్ లో లేని కొత్తదనం, వైవిధ్యం, టేకింగ్ లో చమక్కు, బ్యాక్ గ్రవుండ్ స్కోర్ సరికోత్త మ్యాజిక్కు ఏవీ ఇందులో కనిపించలేదు. 

నిజానికి వెబ్ సిరీస్ అంటే ఇవే కావాల్సినవి. ఎందుకంటే సినిమా మేకింగ్ లోనే స్వేచ్ఛ, కొత్తదనం కోసం ప్రయత్నించే అవకాశం అక్కడే వుంటాయి. కానీ అలాంటి వ్యవహారం ఇక్కడ కనిపించలేదు.