Advertisement

Advertisement


Home > Politics - Analysis

పవన్ కల్యాణ్ ను చెడగొడుతోంది సోషల్ మీడియానే!

పవన్ కల్యాణ్ ను చెడగొడుతోంది సోషల్ మీడియానే!

రాష్ట్రంలో ఉన్న రోడ్ల దుస్థితి మీద జనసేనాని పవన్ కల్యాణ్ తాజాగా సోషల్ మీడియాలో మూడు రోజుల పోరాటం ప్రారంభించారు. తొలిరోజు పోరాటానికి అత్యద్భుతమైన స్పందన వచ్చినట్టుగా పార్టీ ప్రకటించింది. జనసేన ప్రకటించిన గుడ్మార్నింగ్ సీఎం సర్ హ్యాష్ ట్యాగ్ తో తొలిరోజు 3.355 లక్షల ట్వీట్లు వచ్చాయని పార్టీ ప్రకటించింది. అలాగే తొలిరోజు ట్వీట్లు 218 మిలియన్ల మందికి చేరాయని కూడా ప్రకటించారు. 

పవన్ కల్యాణ్ సాధించిన ఘనవిజయం ఏంటంటే.. ఆయన ఉదయం ట్వీట్ చేసి ఈ సోషల్ మీడియా పోరాటాన్ని ప్రారంభించిన తొలి రెండు గంటల్లోనే ట్విటర్ ట్రెండింగ్ లో ఈ హ్యాష్ ట్యాగ్ ఒకటో స్థానానికి చేరుకుంది. అంత త్వరగా ట్రెండ్ కావడం గొప్ప విషయమే. 

అయితే పవన్ కల్యాణ్ లోని క్రియాశీల రాజకీయ నాయకుడిని, ఈ సోషల్ మీడియాను చంపేస్తున్నట్లుగా కనిపిస్తోంది. సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న ట్వీట్లను, రీట్వీట్లను చూసుకుంటూ.. పవన్ కల్యాణ్.. వాపును బలుపుగా ఊహించుకుంటూ.. ఓవర్ కాన్ఫిడెన్స్ తో తన పార్టీని తానే ప్రమాదం అంచులకు నెడుతున్నారనే అభిప్రాయం పలువురిలో వ్యక్తం అవుతోంది. 

ఈ సోషల్ పోరాటానికి సంబంధించి తొలుత ప్రకటన చేసినప్పుడు కూడా పవన్ కల్యాణ్ ఒక విషయం చెప్పుకొచ్చారు. గత ఏడాది రోడ్ల దుస్థితిపై స్పందించమన్ననప్పుడు.. తన పోరాటానికి 1.7 కోట్లమంది జై కొట్టారని అన్నారు. ఏపీ రాష్ట్రంలో ఒక రాజకీయ నాయకుడికి 1.7 కోట్ల మంది మద్దతు దక్కడం అంటే మామూలు సంగతి కాదు! అదే తరహాలో.. ఇప్పుడు కూడా ఈ సోషల్ మీడియా పోరాటం గురించి వెల్లడిస్తున్నారు. 

పవన్ కల్యాణ్ పోరాటంలోని ట్వీట్స్ 218 మిలియన్ల మందికి చేరువైనట్లుగా పార్టీ చాలా ఘనంగా ప్రకటించింది. అంటే దాదాపు ఈ ట్వీట్లు 21 కోట్ల మందికి పైగా చేరాయన్నమాట. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3.66 కోట్లు మాత్రమే. కానీ.. పవన్ కల్యాణ్ పార్టీ చేస్తున్న అధికారిక ప్రకటన ప్రకారం.. మొత్తం ఓటర్ల సంఖ్య కంటె.. ఆరేడు రెట్లు ఎక్కువమందికి ఆయన పోరాటం రీచ్ అయింది.  పోరాటం మూడురోజులు ముగిసే సరికి వంద కోట్ల మందికి పవన్ పోరాటం రీచ్ అయినా కూడా ఆశ్చర్యం లేదు. అంటే జనసేన ప్రకటనల ప్రకారం.. పవన్ కల్యాణ్ ట్వీట్లు దేశ జనాభాలో 70 శాతం మందికి పైగా రీచ్ అవుతుంటాయని అనుకోవచ్చు. 

సరిగ్గా ఇక్కడే వస్తోంది ఇబ్బంది. ఈ ట్వీట్లు ఎందరికి రీచ్ అవుతున్నాయో.. ఎందరు అసలు ట్వీట్ చేస్తున్నారో.. ఎందరు రీట్వీట్ చేస్తున్నారో.. ఆ గణాంకాలు చూసుకుని పవన్ కల్యాణ్ మురిసిపోతున్నారు. ఈ సంఖ్యల గణాంకాలు ఆయనకు విపరీతమైన బలాన్ని ఇస్తుండవచ్చు. కానీ.. ఇది వాపు మాత్రమే అని ఆయన ఎప్పటికి తెలుసుకుంటారు? గత ఎన్నికల సమయంలో కూడా ఇలాంటి ప్రమాదమే జరిగింది. పవన్ కల్యాణ్ ఎన్నికల సభలకు వచ్చిన వాళ్లంతా ఓట్లు వేసి ఉంటే.. ఆయన పార్టీ ఘన విజయంతో అధికారంలోకి వచ్చి ఉండాలి. పవన్ స్వయంగా తాను రెండు చోట్లఓడిపోయారు. 

తన మీటింగ్ కు వచ్చి విజిల్స్ వేసేవారంతా.. తనకు  ఓట్లు వేయడం లేదు అనే క్లారిటీ ఆయనకు అప్పట్లో వచ్చింది. ఇప్పుడు కూడా అలా ప్రాక్టికల్ గా వీటిని ఆయన చూడగలగాలి. ట్వీట్లు చేస్తున్న వాళ్లు, చూస్తున్న వాళ్లు అంతా గంపగుత్తగా తనకు  ఓటు వేయబోవడం లేదని తెలుసుకోవాలి. అలా కాకుండా.. ఈ ట్వీట్లు చూసిన 21 కోట్ల మంది తనకు వెల్లువలా ఓట్లు వేస్తారని భ్రమ పడితే గనుక.. ఆయన ఎన్నికల్లోగా జాతీయ పార్టీ పెట్టేసి మోడీకి సవాలు విసరొచ్చు కూడా. 

సోషల్ స్పందనలు ఎప్పుడూ నమ్మదగినవి కాదు. అవి ఒక వాదనను బలంగా ఎక్కువమంది దృష్టిని ఆకర్షించేలా చేయడానికి ఉపయోగపడతాయి తప్ప.. వాటిని బలంగా భావించుకుని తదనుగుణంగా వ్యూహాలను సిద్ధంచ చేసుకుంటో బోల్తా కొడతారు. ఆ విషయం పవన్ కు త్వరలోనే తెలిసి రావొచ్చు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?