మెగాస్టార్…ప్లస్ రామ్ చరణ్ కాంబినేషన్ లో డైరక్టర్ కొరటాల శివ రూపొందించిన ఆచార్య సినిమా సెన్సారు ఫార్మాలిటీలు పూర్తయ్యాయి. ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు సెన్సారు టాక్ కోసం.
టాలీవుడ్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఆచార్య సినిమా మెగా ఫ్యాన్స్ కు నచ్చేలా వుంటుంది. అచ్చం మెగాస్టార్ చిరంజీవి సినిమాలా వుంటుంది.
కొరటాల శివ కథ, కథనాలకు ఓ స్టయిల్ వుంటుంది. చిరంజీవి ఫార్మాట్ వేరుగా వుంటుంది. ఆచార్య సినిమా మెగాస్టార్ ఫార్మాట్ కు దగ్గరగా వుంటుందని, మరీ పక్కా కొరటాల సినిమా మాదిరిగా వుండదని టాక్ వినిపిస్తోంది.
సినిమాలో ఇంట్రవెల్ బ్యాంగ్, క్లయిమాక్స్ ఇంట్రస్టింగ్ మలిచారని టాక్. సినిమా తొలిసగం కన్నా మలిసగానికి ఎక్కువ మార్కులు పడతాయట. సినిమా మొత్తం అడవి నేపథ్యంలోనే వుంటుంది. సినిమా మొత్తం మీద మెగాస్టార్ కన్నా రామ్ చరణ్ నటనకే ఫ్యాన్స్ ఫిదా అవుతారని టాక్. రామ్ చరణ్ తొలిసగంలో కనిపించరు.
మొత్తం మీద ఫ్యాన్స్ ఆసక్తిని మరింత పెంచేలాగే వుంది ఆచార్య సెన్సారు టాక్.