యాక్టర్ రోజా ఎమ్మెల్యే అయ్యారు. ఇపుడు మినిస్టర్ కూడా అయ్యారు. ఆమె టూరిజం మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆమె తొలి అడుగు విశాఖ వైపుగానే పడింది. విశాఖ అంటేనే టూరిజానికి పెట్టింది పేరు. దాంతో ఈ నెల 23న రోజా విశాఖ రానున్నారు.
ఆమె ఉమ్మడి విశాఖ జిల్లాలో సుడిగాలి పర్యటన చేయబోతున్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు నడయాడిన ప్రాంతాలలో రోజా పర్యటిస్తారు. అదే విధంగా టూరిజం ప్రాజెక్టుల పురోగతి మీద సమీక్ష చేస్తారు.
ఆమె విశాఖతో పాటు అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలలో పర్యటించడం ద్వారా క్షేత్ర స్థాయి పరిస్థితులను తెలుసుకుంటారు. అదే విధంగా ఆమె విశాఖను టూరిజం హబ్ గా మార్చేందుకు కూడా కీలకమైన ప్రాజెక్టులను ప్రకటిస్తారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
మొత్తానికి ఇంతకాలం నటిగా, ఎమ్మెల్యేగా విశాఖ వచ్చిన రోజా ఫస్ట్ టైమ్ మినిస్టర్ గా సిటీ ఆఫ్ డెస్టినీలో అడుగుపెడుతున్నారు. మరి వీకెండ్ లో టూరిజం మినిస్టర్ చేస్తున్న టూర్ ఎలా సాగుతుంది, ఏ సంచలనాలను నమోదు చేస్తుంది అన్నది చూడాల్సిందే.