కార్తికేయ కథానాయకుడిగా కొత్త సినిమా ప్రారంభమైంది. ఒక జానర్‌కు తనను పరిమితం చేసుకోకుండా డిఫరెంట్ జానర్ ఫిలిమ్స్ చేయడం కార్తికేయ పద్దతి అందులో భాగంగానే కామెడీని డ్రామాతో కలిపి – డ్రామెడీ జానర్ సినిమా చేస్తున్నాడు.
లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. కార్తికేయకు జంటగా 'డీజే టిల్లు' ఫేమ్ నేహా శెట్టిని సెలెక్ట్ చేశారు. ఈ రోజు పూజతో సినిమాను స్టార్ట్ చేయడంతో పాటు రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించారు. అలాగే, కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేశారు.
“కామెడీ డ్రామాగా, గోదావరి నేపథ్యంలో సాగే కథతో సినిమా తీస్తున్నాం. మా హీరోకి డిఫరెంట్ ఫిల్మ్ అవుతుంది. సిరివెన్నెల మా చిత్రంలో ఒక పాట రాశారు. ఆయన రాసిన ఆఖరి పాట ఇదే” అని నిర్మాత బెన్నీ ముప్పానేని చెప్పారు.
క్లాక్స్ దర్శకుడిగా ఇంట్రడ్యూస్ అవుతున్న ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, సహ నిర్మాతలు: అవనీంద్ర ఉపద్రష్ట, వికాస్ గున్నల, సమర్పణ: యువరాజ్.