దర్శకుడు కొరటాల శివ ఫుల్ క్లారిటీతో వుంటారు. క్వాలిటీని పక్కాగా చూసుకుంటారు. కానీ ఇప్పుడు అదే సమస్య అవుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆచార్య సినిమాకు మణిశర్మ ను సంగీత దర్శకుడిగా తీసుకున్నారు.
ఇప్పటికే రెండు పాటలు వచ్చాయి. రెండూ హిట్ అయ్యాయి. అయితే సమస్య అంతా బ్యాక్ గ్రవుండ్ స్కోర్ దగ్గర వచ్చిందని తెలుస్తోంది. బ్యాక్ గ్రవుండ్. స్కోర్ కు మణిశర్మ పెట్టింది పేరు. ఎన్నో సినిమాలకు ఆయన కేవలం బ్యాక్ గ్రవుండ్ స్కోర్ మాత్రమే ఇచ్చిన సందర్భాలు వున్నాయి. కానీ మణిశర్మ చేసిన బ్యాక్ గ్రవుండ్ స్కొర్ నచ్చక, ఆ బాధ్యతలను మిక్కీ జె మేయర్ కు అప్పగించారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
కానీ ఆయన వర్క్ కూడా సంతృప్తి ఇవ్వక మళ్లీ తీసుకువచ్చి మణిశర్మ తనయుడు స్వరసాగర్ కు అప్పగించారని ఇంకో గుసగుస. మొత్తానికి ఆచార్య రీరికార్డింగ్ వ్యవహారం మీద చాలా గట్టి గ్యాసిప్ లే వినిపిస్తున్నాయి. నిజానికి మణిశర్మ, మిక్కీ జె మేయర్ మంచి సంగీత దర్ళకులే. ఎందుకు వీరి వర్క్ కొరటాల శివకు 100 పర్సంట్ శాటిస్ ఫ్యాక్షన్ ఇవ్వడం లేదో అన్నది తెలియడం లేదు.
గతంలో కొరటాల శివకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు మంచి ఆల్బమ్ లే అందించారు. కానీ ఎందుకో ఈసారి మణిశర్మ దగ్గరకు వెళ్లారు.