ఇటు రూమర్లకు చెక్.. అటు బిజినెస్ హైక్

చిరంజీవి-కొరటాల కాంబోలో వస్తున్న ఆచార్య సినిమాలో ఓ కీలక పాత్ర కోసం మహేష్ ను అనుకున్నారు. మహేష్ కూడా చేయడానికి ఒప్పుకున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఆఖరి నిమిషంలో తిరిగి ఆ క్యారెక్టర్ రామ్…

చిరంజీవి-కొరటాల కాంబోలో వస్తున్న ఆచార్య సినిమాలో ఓ కీలక పాత్ర కోసం మహేష్ ను అనుకున్నారు. మహేష్ కూడా చేయడానికి ఒప్పుకున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఆఖరి నిమిషంలో తిరిగి ఆ క్యారెక్టర్ రామ్ చరణ్ చెంతకే చేరింది. ఇంతకీ ఈ సినిమాలో ఆ ప్రత్యేకమైన పవర్ ఫుల్ పాత్రను మహేష్ చేస్తున్నాడా.. రామ్ చరణ్ చేస్తున్నాడా..?

ఈ ఉత్కంఠకు ఉగాది నాడు తెరదించాలని భావిస్తోంది యూనిట్. ఉగాది రోజున ఆచార్య టైటిల్ లోగోను రిలీజ్ చేయాలనేది ప్రాధమికంగా అనుకున్న ప్లాన్. దీనికి ఇప్పుడు చిన్నపాటి మార్పులు చేశారు. టైటిల్ తో పాటు చిరంజీవి, రామ్ చరణ్ లేటెస్ట్ ఫొటోతో ఆచార్య లుక్ రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. ఇలా చేయడం వల్ల సినిమాకు హైప్ రావడంతో పాటు, రూమర్లకు చెక్ పెట్టినట్టవుతుందని యూనిట్ భావిస్తోంది.

నిజానికి ఇలా ఉన్నఫలంగా చిరంజీవి-చరణ్ కలిసున్న లుక్ ను విడుదల చేయాలని అనుకోవడం కాస్త తొందరపాటు చర్యే అవుతుంది. కానీ చిరు-చరణ్ కలిసి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సైరా ప్రభావంతో ఆచార్య బిజినెస్ కాస్త డల్ అయింది. కొన్ని ఏరియాల్లో థియేట్రికల్ తో పాటు నాన్-థియేట్రికల్ పరంగా ఈ సినిమాకు చెప్పిన రేట్లు విని కొందరు డైలమాలో పడ్డారు. సో.. సినిమాకు హైప్ తీసుకురావాలన్నా, బిజినెస్ పెంచాలన్నా.. ఇలా చరణ్-చిరు లుక్ ను ఒకేసారి విడుదల చేయడమే కరెక్ట్ అని భావిస్తున్నారు.

మరోవైపు ఈ సినిమా నుంచి త్రిష తప్పుకోవడం కూడా తమకు కాస్త కలిసొచ్చిన విషయంగా చెబుతోంది యూనిట్. ఆచార్య నుంచి తప్పుకుంటున్నట్టు నిన్న సాయంత్రం త్రిష ప్రకటించింది. దీంతో ఇప్పుడామె స్థానంలో కాస్త క్రేజ్ ఉన్న హీరోయిన్ ను తీసుకోవాలని అనుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల మూవీకి ఇంకాస్త మార్కెట్ పెరుగుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతానికైతే మరోసారి కాజల్ కోసం ప్రయత్నిస్తున్నారు. కోరినంత రెమ్యూనరేష్ ఇవ్వగలిగితే కాజల్ సెట్ అయినట్టే.

స్క్రిప్టులో వేలు పెట్టట్లేదు..

నాకు హీరోయిన్స్ పెళ్లి చేసుకుంటే నచ్చదు