రొడ్డకొట్టుడు దారిలో ‘కొరటాల’

దర్శకుడు కొరటాల శివ కు ఓ స్టయిల్ వుంది. ఆయన సినిమాలకు ఓ ఎమోషనల్ టచ్ వుంటుంది. డైలాగ్ రైటింగ్ పవర్ వుంటుంది. ఇక గ్రాండియర్, యాక్షన్ సంగతి సరేసరి. నాలుగేళ్లుగా వేచి వున్నారు…

దర్శకుడు కొరటాల శివ కు ఓ స్టయిల్ వుంది. ఆయన సినిమాలకు ఓ ఎమోషనల్ టచ్ వుంటుంది. డైలాగ్ రైటింగ్ పవర్ వుంటుంది. ఇక గ్రాండియర్, యాక్షన్ సంగతి సరేసరి. నాలుగేళ్లుగా వేచి వున్నారు కొరటాల ఫ్యాన్స్ ఆయన సినిమా కోసం. ఆచార్య సినిమా విడుదల దగ్గరకు రావడంతో, ట్రయిలర్ వచ్చింది. అయితే ఇది ఎంత మాత్రం కొరటాల మార్క్ ట్రయిలర్ కాదు.

ప్రస్తుతం నడుస్తున్న రొడ్డ ‘కొట్టుడు’ ట్రెండ్ ను ఫాలో అవుతూ కట్ చేసిన ట్రయిలర్. యాక్షన్ సీన్లను జ‌నం బాగా లైక్ చేస్తున్నారనే భావనతో కట్ చేసిన యాక్షన్ ట్రయిలర్ ఇది. అఖండ, కేజిఎఫ్ ల మాదిరిగా పక్కా యాక్షన్ కట్ ట్రయిలర్ అందించారు. ఇక్కడ మరో సమస్య ఏమిటంటే కథ. సినిమాలో కథ థిన్ లైన్ అని తెలిసిపోతోంది. 

కొరటాల శివ సినిమాల్లో హీరోయిన్ ట్రాక్ కు అంత ప్రాధాన్యత వుండదు. ఆచార్య సినిమాలో కూడా అంతే అన్నట్లుగా వుంది ట్రయిలర్ చూస్తుంటే. అయితే అంత మాత్రం చేత కొరటాలను తక్కువ అంచనా వేయడానికి లేదు. బహుశా జ‌నం ఈ ట్రెండ్ ఫాలో అవుతున్నారని ఆయన ఈ తరహా ట్రయిలర్ కట్ చేసి వుండొచ్చు. ఎమోషన్ సీన్లు అన్నీ తరువాత చూపించవచ్చు.

అన్నీ అలా వుంచితే ఇంతకీ ఆచార్య సినిమాకు హీరో చరణ్ నా? మెగాస్టార్ నా? అలాగే గెస్ట్ హీరో మెగాస్టార్ నా? చరణ్ నా? ఈ సందేహం రేకెత్తించడంలో మాత్రం సక్సెస్ అయింది ట్రయిలర్.