హీరోయిన్ ఇన్ స్టాగ్ర‌మ్ ఫాలోయ‌ర్లు 50 మిలియ‌న్లు!

బాలీవుడ్ లో స్టార్ డ‌మ్ ను సాధించ‌క‌మునుపే ఇన్ స్టాగ్ర‌మ్ లో భారీ సంఖ్య‌లో ఫాలోయ‌ర్ల‌ను సంపాదించుకోవ‌డం మొద‌లుపెట్టింది దిశా ప‌టానీ.  Advertisement గ‌త కొన్నేళ్లుగా ఇన్ స్టాగ్ర‌మ్ లో అత్య‌ధిక ఫాలోయ‌ర్ల‌ను క‌లిగి…

బాలీవుడ్ లో స్టార్ డ‌మ్ ను సాధించ‌క‌మునుపే ఇన్ స్టాగ్ర‌మ్ లో భారీ సంఖ్య‌లో ఫాలోయ‌ర్ల‌ను సంపాదించుకోవ‌డం మొద‌లుపెట్టింది దిశా ప‌టానీ. 

గ‌త కొన్నేళ్లుగా ఇన్ స్టాగ్ర‌మ్ లో అత్య‌ధిక ఫాలోయ‌ర్ల‌ను క‌లిగి ఉన్న సెల‌బ్రిటీల్లో ఒక‌రిగా నిలుస్తోంది ఈ న‌టీమ‌ణి. ఈ క్ర‌మంలో మ‌రో ఘ‌న‌త‌ను సొంతం చేసుకుంది దిశ‌. తాజాగా ఆమె ఇన్ స్టా ఫాలోయ‌ర్ల సంఖ్య 50 మిలియ‌న్ల మార్కును దాటేసింది.

ప్ర‌స్తుతం బాలీవుడ్ లో చేతినిండా అవ‌కాశాల‌తో, భారీ పారితోషికం పొందుతున్న హీరోయిన్ల‌లో ఒక‌రిగా ఉన్న దిశ ఫాలోయింగ్ కు సంబంధించి మైల్ స్టోన్. త‌న ఫాలోయ‌ర్ల సంఖ్య ఐదు కోట్ల‌ను దాటేయ‌డం ప‌ట్ల దిశ సంతోషాన్ని వెలిబుచ్చింది. త‌న ఫాలోయ‌ర్ల సంఖ్య‌ 50 మిలియ‌న్ల మార్కును దాటిన సంద‌ర్భానికి కృత‌జ్ఞ‌త‌గా త‌న ప్ర‌త్యేక ఫొటోను పోస్టు చేసింది దిశ‌.

ఇన్ స్టా లో త‌ర‌చూ హాట్ హాట్ పిక్స్ ను పోస్టు చేయ‌డంలో దిశా ప‌టానీ ముందుంటుంది. దీంతోనే ఈమె ఫాలోయ‌ర్ల సంఖ్య రెగ్యుల‌ర్ గా పెరుగుతూ ఉంద‌నుకోవాలి. అయినా అరివీర భ‌యంక‌ర‌మైన హిట్ సినిమాల్లో చేయ‌క‌పోయినా, ప్ర‌ధానంగా హిందీ సినిమాల‌కే ప‌రిమితం అయినా.. దిశ ఫాలోయింగ్ మాత్రం భారీ స్థాయిలోనే ఉంది.