ఆచార్య Vs అఖండ.. ఒకటే క్లయిమాక్స్, రిజల్ట్ వేరు!

కొన్నాళ్ల కిందటి మాట.. ఆచార్య సినిమా షూటింగ్ పూర్తయిందంటూ వార్తలొచ్చాయి. ఆ వెంటనే కొన్ని రోజులకు ఆచార్య కొత్త షెడ్యూల్ మొదలైందంటూ లీకులొచ్చాయి. అప్పుడే అందరికీ అనుమానం వచ్చింది.  Advertisement ఆచార్యకు సంబంధించి రీషూట్…

కొన్నాళ్ల కిందటి మాట.. ఆచార్య సినిమా షూటింగ్ పూర్తయిందంటూ వార్తలొచ్చాయి. ఆ వెంటనే కొన్ని రోజులకు ఆచార్య కొత్త షెడ్యూల్ మొదలైందంటూ లీకులొచ్చాయి. అప్పుడే అందరికీ అనుమానం వచ్చింది. 

ఆచార్యకు సంబంధించి రీషూట్ వ్యవహారం ఏదో జరుగుతోందని అంతా గుసగుసలాడుకున్నారు. నిన్న సినిమా రిలీజైన తర్వాత చూస్తే, ఆ రీషూట్ చేసిన పోర్షన్ ఏంటనేది అందరికీ ఓ క్లారిటీ వచ్చింది.

ఆచార్య క్లైమాక్స్ ను రీషూట్ చేసి ఉంటారనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. మరీ ముఖ్యంగా అఖండ సినిమా రిలీజై సూపర్ హిట్టయిన తర్వాత ఆచార్య సినిమా క్లైమాక్స్ లో మార్పుచేర్పులు చోటుచేసుకున్నాయని అంటున్నారు చాలామంది. అఖండ సినిమా క్లయిమాక్స్ లో కనిపించిన వాతావరణం మొత్తం ఆచార్య క్లయిమాక్స్ లో రిపీట్ అయింది.

పసుపు-కుంకుమలు, అఘోరాలు, అమ్మవారు, త్రిశూలం.. ఇలా టోటల్ సెటప్ మొత్తం అఖండను తలపించింది. చివరికి ఫైటింగ్ థీమ్ కూడా అఖండ తరహాలోనే సాగింది. వందల మందిని చిరంజీవి నరుక్కుంటూ వెళ్లడం, రౌడీలను గాల్లో లేపడం లాంటివి అఖండ క్లయిమాక్స్ ను గుర్తు చేస్తాయి. చివరికి ఆ ఎపిసోడ్ లో కలర్ స్కీమ్ కూడా అఖండనే గుర్తుచేయడం విశేషం.

అయితే అఖండ మేజిక్ ను ఆచార్య రిపీట్ చేయలేకపోయింది. అఖండలో బాలకృష్ణ చేసిన ఫైట్ ఎమోషనల్ గా సాగితే, ఆచార్యలో అదే తరహాలో తీసిన ఫైట్ ఎలాంటి ఫీల్ ను అందించకపోవడం బాధాకరం. మరో ప్రధానమైన తేడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్. అఖండ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. తెరపై బాలకృష్ణ ఉగ్రరూపం చూపిస్తే, తెరవెనక తమన్ తన బీజీఎంతో విశ్వరూపం చూపించాడు.

ఆచార్య క్లయిమాక్స్ లో మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తేలిపోయింది. ఒకప్పుడు రీ-రికార్డింగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు కేరాఫ్ అడ్రస్ గా కొనసాగిన మణిశర్మ.. కీలకమైన ఆచార్య క్లయిమాక్స్ విషయంలో ఫెయిల్ అయ్యాడు. 

అఖండ, ఆచార్యను కంపార్ చేయాల్సి వస్తే కేవలం క్లయిమాక్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రమే కాదు.. కథ విషయంలో కూడా చాలా పోలికలున్నాయి. కాకపోతే క్లయిమాక్స్ విషయంలోనే ఎక్కువ చర్చ జరుగుతోంది.