గోపీచంద్ సినిమాలు ఎలా ఉంటాయో మనందరికీ తెలిసిందే. పక్కా యాక్షన్, మాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా కనిపిస్తాయి. ఈసారి ఫర్ ఏ ఛేంజ్.. ఆ మాస్ కు కాస్త డివోషనల్ టచ్ ఇచ్చారు. భీమా ట్రయిలర్ లో యాక్షన్ ఎంత కనిపించిందో, భక్తి కూడా అంతే కనిపించింది.
రవితేజ తన కెరీర్ లో ఇప్పటివరకు ఇలాంటి సబ్జెక్ట్ టచ్ చేయలేదనే విషయం ట్రయిలర్ చూస్తే అర్థమౌతుంది. రాక్షసుల నుంచి కాపాడ్డానికి ఆ పరమశివుడు బ్రహ్మరాక్షసుడ్ని పంపించాడనే వాయిస్ ఓవర్ తో గోపీచంద్ ఇంట్రడక్షన్ బాగుంది.
పోలీస్ గెటప్ లో గోపీచంద్ లుక్ ఇదివరకే వచ్చేసింది. కాకపోతే ఈ సినిమాలో మరో లుక్ కూడా ఉంది. దాన్ని ట్రయిలర్ తో ఆవిష్కరించారు మేకర్స్. రెండు డిఫరెంట్ గెటప్స్ లో గోపీచంద్ బాగున్నాడు.
'ఊచకోత మొదలుపెడితే ఈ ఊరిలో శ్మశానం కూడా సరిపోదు నా కొడకా..' అనే మాస్ డైలాగ్ తో పాటు.. శివ భక్తుడి గెటప్ లో కొన్ని శక్తులతో డివోషనల్ గా కనిపించే పాత్రను కూడా చూపించి ఆసక్తి పెంచారు మేకర్స్.
ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాతో కన్నడ దర్శకుడు హర్ష, టాలీవుడ్ కు పరిచయమౌతున్నాడు. ట్రయిలర్ లో విజువల్స్, రవి బస్రూర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి.
శివరాత్రి కానుకగా మార్చి 8న థియేటర్లలోకి వస్తోంది భీమా సినిమా. కెకె రాధామోహన్ ఈ సినిమాకు నిర్మాత.