నో బెయిల్.. నిరాశలో హీరో ఫ్యాన్స్

ఈరోజు కచ్చితంగా బెయిల్ వస్తుందనుకున్నారు. అందుకే బాణసంచా కాల్చడానికి ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. కానీ దర్శన్ అభిమానులకు నిరాశ ఎదురైంది. ఈరోజు దర్శన్ కు బెయిల్ దొరకలేదు. బెయిల్ పై విచారణను కోర్టు 8వ…

ఈరోజు కచ్చితంగా బెయిల్ వస్తుందనుకున్నారు. అందుకే బాణసంచా కాల్చడానికి ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. కానీ దర్శన్ అభిమానులకు నిరాశ ఎదురైంది. ఈరోజు దర్శన్ కు బెయిల్ దొరకలేదు. బెయిల్ పై విచారణను కోర్టు 8వ తేదీకి వాయిదా వేసింది.

వీరాభిమాని రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ హీరో, ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ జ్యూడీషియల్ రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బళ్లారి జైలులో ఉన్న అతడికి ఈరోజు కచ్చితంగా బెయిల్ వస్తుందని అంతా ఎదురుచూశారు. దీనికి కారణం పోలీసులు విచారణలో జాప్యం చేయడమే.

దర్శన్ తరఫు న్యాయవాది ఈ విషయాల్ని ప్రస్తావించారు. నిన్ననే ఆయన వాదనలు వినిపించారు, ఈరోజు కూడా తన వాదనల్ని సుదీర్ఘంగా వినిపించారు. వాంగ్మూలాల సేకరణలో పోలీసులు జాప్యం చేశారని, సాక్ష్యుల సమాచారం ఛార్జ్ షీటులో లేదని, ఎక్కడ విచారణ జరిపారనే విషయాల్ని కూడా పొందుపరచలేదని ఆరోపించారు.

పోలీసుల లెక్క ప్రకారం చూసుకున్నా, కేసు విచారణ దాదాపు కొలిక్కి వచ్చింది కాబట్టి సుప్రీంకోర్టు పాత ఆదేశాలను అనుసరించి దర్శన్ కు బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరారు. దర్శన్ కు వ్యతిరేకంగా సృష్టించిన సాక్ష్యాలన్నీ కల్పితమన్నారు. దీనిపై స్పందించడానికి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ టైమ్ కోరడంతో, దర్శన్ కు బెయిల్ దొరకలేదు. తుది విచారణను 8కి వాయిదా వేశారు.

ఈ హత్య కేసులో 17 మందిని అరెస్ట్ చేయగా.. ఇప్పటికే ఏ-15, ఏ-16, ఏ-17కు బెయిల్ వచ్చింది. దర్శన్ ఏ-2గా ఉన్నాడు. అతడికి కూడా బెయిల్ వచ్చేస్తే.. ఏ-1గా ఉన్న పవిత్ర గౌడకు కూడా బెయిల్ వచ్చే అవకాశాలు ఎక్కువవుతాయి. ఇటు దర్శన్, అటు పవిత్ర వేసిన బెయిల్ పిటిషన్లపై విచారణ మంగళవారానికి వాయిదా పడింది.

మరోవైపు బళ్లారి జైళ్లో ఉన్న దర్శన్, తీవ్రమైన వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. జైలులో ట్రీట్ మెంట్ చేయించుకోవడానికి అతడు నిరాకరించాడు. తనను వెంటనే బెంగళూరు షిఫ్ట్ చేయాలని అతడు కోరుతున్నాడు. అతడికి సర్జరీ చేయాలని వైద్యులు ఇప్పటికే సూచించారు. ఈ విషయాన్ని కూడా దర్శన్ తరఫు లాయర్ కోర్టు ముందుకు తీసుకొచ్చారు.

2 Replies to “నో బెయిల్.. నిరాశలో హీరో ఫ్యాన్స్”

Comments are closed.