పాలించ‌మ‌ని ప‌గ్గాలు ఇస్తే చంద్ర‌బాబు, ప‌వ‌న్ చేసేది ఇదేనా!

తాము చెప్పిందే వేదం అనే ప‌రిస్థితుల్లో చంద్ర‌బాబు, ప‌వ‌న్ లు ఏదేదో చేసుకుంటూ పోతున్న‌ట్టుగా ఉన్నారు.

అమ‌రావ‌తి ఊసు లేదు, వ‌ర‌ద బాధితులు వీధికెక్కినా లెక్క‌లేదు, పెట్టుబ‌డులు, కొత్త కంపెనీల ముచ్చ‌ట్లు లేవు, సూప‌ర్ సిక్స్ హామీల మీన‌మేషాల లెక్కింపు! కొన‌సాగుతున్న అప్పుల చిట్టా.. ఏతావాతా కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి వంద రోజులు గ‌డిచిపోయిన త‌ర్వాత త‌ర‌చి చూస్తే క‌నిపించేది ఇదే! అధికారంలోకి రాగానే అద్భుతాలు చేస్తామ‌ని, సంప‌ద సృష్టిస్తామ‌ని, ఆరు హామీల‌ను అమ‌లు ప‌రుస్తామ‌ని చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్ లు ఎన్నిక‌ల స‌మ‌యంలో ఊద‌ర‌గొట్టారు. ఆ హామీల‌ను ప్ర‌తి చోటా చ‌దివి వినిపించారు. మ‌రి ఇప్ప‌టి వ‌ర‌కూ నెర‌వేర్చిన హామీలు ఏమిటంటే.. పెన్ష‌న్ల పెంపు! అదొక్క‌టీ చేశారు.

ఇచ్చిన అన‌వ‌గాని హామీల‌కు అంతే లేదు! అన్నా క్యాంటీన్లు అంటూ హ‌డావుడి చేశారు. అయితే దానిపై మిశ్ర‌మ స్పంద‌న‌ల‌కు కొద‌వ‌లేదు. దీపావ‌ళి నుంచి మూడు గ్యాస్ సిలెండ‌ర్ల‌కు శ్రీకారం చుడ‌తార‌ట! అయితే బ‌స్సుల్లో మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణం, రైతుల‌కు పెట్టుబ‌డి సాయాలు, ఇంట్లో ఎంత‌మంది పిల్ల‌లు ఉంటే వారంద‌రికీ త‌ల్లికి వంద‌నం తో స‌హా లెక్క‌లేన‌న్ని హామీల గురించి చంద్ర‌బాబు మాట్లాడ‌టం లేదు. తెలుగుదేశం పార్టీ మెనిఫెస్టోని బ‌య‌ట‌కు తీస్తే.. ఇంకా బొచ్చెడు హామీలు న్నాయి.

ఇక అమ‌రావ‌తి అంశం గురించి మాట్లాడ‌టం లేదు కూట‌మి ప్ర‌భుత్వం. వ‌ర‌ద‌ల త‌ర్వాత ప‌రిస్థితి మ‌రింత ఇర‌కాటంగా మారిన‌ట్టుగా ఉంది. అమ‌రావ‌తికి ప్ర‌పంచ బ్యాంకు రుణాన్ని నిరాక‌రించింద‌ని స్వ‌యంగా మంత్రివ‌ర్యులే చెప్పారు. ఓ మోస్త‌రు వ‌ర్షాల‌కే అమ‌రావ‌తి ప‌రిస్థితి అలా త‌యారైంది. ఇప్పుడు అమ‌రావ‌తి చుట్టూ పెద్ద గోడ‌నో, నీళ్లు ప్ర‌వేశించ‌కుండా కోట‌నో క‌ట్టాల్సిన బాధ్య‌త చంద్ర‌బాబు మీద ప‌డిన‌ట్టుగా ఉంది. జ‌గ‌న్ ఏపీకి రాజ‌ధానిని లేకుండా చేశాడంటూ తెలుగుదేశం వాళ్లు గ‌త ఐదేళ్ల‌లో తెగ ట్రోల్ చేశారు. ఏపీకి రాజధాని ఏదో చెప్ప‌మంటూ వీడియోలు పెట్టారు! మ‌రి ఇప్పుడు ఏపీకి రాజ‌ధాని ఏది? మ‌రి ఆ మేర‌కు ఒక జీవోను అయినా విడుద‌ల చేయ‌గ‌లుగుతున్నారా! అమ‌రావ‌తిని ఏకైక రాజ‌ధానిగా ప్ర‌క‌టిస్తూ చంద్ర‌బాబు ప్ర‌క‌ట‌న అయినా చేయాలి క‌దా! మామూలుగా అయితే అలాంటి లాంఛ‌నం ఒక‌టి జ‌రిగేదేమో కానీ, వ‌ర‌ద‌ల వ్య‌వ‌హారంతో ఇప్పుడు చంద్ర‌బాబు అది చేయ‌డానికి వెనుకాడుతున్న‌ట్టుగా ఉన్నారు!

అలాగే త‌మ‌కు అధికారం ఇస్తే లెక్కకు మిక్కిలి కంపెనీల‌ను ఎడా పెడా ఏపీకి ఈడ్చుకురావ‌డ‌మే అంటూ కూడా చాలా మాట‌లు చెప్పారు ఎన్నిక‌లకు ముందు. మ‌రి వంద రోజులు అయిపోయాయి క‌దా.. చంద్ర‌బాబు అది సాధించారు, ఇది సాధించారు అని చెప్పేందుకు కూడా ఏమీ లేకుండా పోయిన‌ట్టుగా ఉంది. స‌హ‌జంగా వచ్చే పెట్టుబ‌డుల ఊసు కూడా లేకుండా పోయిన‌ట్టుగా ఉంది. మ‌రి ఇందుకే స‌ర్వ‌రోగ నివారిణిగా తిరుప‌తి ల‌డ్డు అంశాన్ని క‌దిపార‌నే విమ‌ర్శ‌ల జ‌డి కూడా పెరుగుతూ ఉంది.

అన్ని అంశాల‌నూ డైవ‌ర్ట్ చేయ‌డానికి తిరుప‌తి ల‌డ్డు అంశాన్ని క‌దిలించి, అందులో ప‌స లేక‌పోవ‌డంతో ఇప్పుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ దాన్ని కూడా వ‌దిలి సనాత‌న ధ‌ర్మం అంటూ మ‌రో అవ‌తారం ఎత్తాడ‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇచ్చిన హామీలు, పాల‌న బాధ్య‌త‌లు వ‌దిలి ఇలా మ‌తం, కులం అంటూ ప్ర‌జ‌ల‌ను డైవ‌ర్ట్ చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టుగా ఉన్నారు. వీరు ఏం చెప్పినా ఊగిపోయే వీరాభిమానుల‌కు కొద‌వ‌లేదు. అండ‌గా మీడియా కూడా ఉంది. కాబ‌ట్టి.. తాము చెప్పిందే వేదం అనే ప‌రిస్థితుల్లో చంద్ర‌బాబు, ప‌వ‌న్ లు ఏదేదో చేసుకుంటూ పోతున్న‌ట్టుగా ఉన్నారు.

జ‌గ‌న్ రోడ్లు వేయ‌లేద‌ని, ఒక పాత మ‌ట్టి వేయ‌లేద‌ని.. చంద్ర‌బాబు గ‌త ఐదేళ్ల‌లో తెగ ఇదైపోయారు. అంత‌కు ముందు ఐదేళ్ల‌లో త‌నేదో రోడ్ల‌ను ఉద్ధ‌రించిన‌ట్టుగా చెప్పుకున్నారు, అదే జ‌రిగి ఉంటే.. ఏపీలో రోడ్ల ప‌రిస్థితి అలా ఎందుకు త‌యార‌య్యేది. మ‌రి గ‌త ఐదేళ్ల‌లో రోడ్ల‌పై తెగ రాజ‌కీయం చేసిన వాళ్లు ఇప్పుడు రోడ్ల ప‌రిస్థితిని అప్పుడే మ‌రిచిపోయారు! వంద రోజుల్లో ఎక్క‌డా ఒక్క కిలోమీట‌ర్ రోడ్డును కూడా స‌రిచేసిన దాఖ‌లాలు క‌నిపించ‌డం లేదు. పంచాయ‌తీ రోడ్లు అయినా, మున్సిపాలిటీ రోడ్లు అయినా, ఆర్ అండ్ బీ రోడ్లు అయినా.. చాలా దారుణంగానే ఉన్నాయి. ఉన్న రోడ్ల‌కు స్టేట్ టోల్ గేట్లు పెట్టే ప్ర‌తిపాద‌న కూడా చేశారు. ఇదీ సంప‌ద సృష్టి జ‌రుగుతున్న వైనం అనే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించాడు, నాశ‌నం చేశాడంటూ ఐదేళ్లు చెప్పి చెప్పీ అధికారం సాధించుకున్న వంద రోజుల్లోనే అన్ని స‌మ‌స్య‌ల‌కూ నివార‌ణ‌గా, అన్ని ర‌కాలుగానూ చేతులెత్తేసి ఇలా డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ ను న‌మ్ముకుంటే.. ఇంకా కాలం చాలానే ఉంది. ఇంకా స‌మాధానం చెప్పాల్సిన స‌మ‌యం చాలానే ఉంది. ఏ ఎన్నిక‌ల ముందో ఇలాంటి డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ వ‌ర్క్ అవుట్ అయ్యేవేమో కానీ.. ఇప్ప‌టి నుంచి డైవ‌ర్ట్ చేసేస్తే ఇలా డైవ‌ర్ట్ చేయ‌డానికి ఇంకా చాలా చిచ్చే పెట్టాల్సి ఉంటుంది. కులాల వారీగా, మ‌తాల వారీగా జ‌నాలు రోడ్ల మీద‌కు వ‌చ్చి కొట్టుకునే చేసేంత వ‌ర‌కూ తీసుకెళ్లాల్సి ఉంటుందేమో.

50 Replies to “పాలించ‌మ‌ని ప‌గ్గాలు ఇస్తే చంద్ర‌బాబు, ప‌వ‌న్ చేసేది ఇదేనా!”

  1. ముందు జగన్ నీ,

    ప్రజల డబ్బుతో కొన్న ఫర్నిచర్ కాజే*సి ఇంట్లో వేసుకున్నాడు.

    ముందు దాని డబ్బులు అసలు , వడ్డీ తో సహా ప్రజలకు అంటే ప్రభుత్వానికి తిరిగి కట్టమని చెప్పు.

    అలాగే రోజుకు ప్రజల డబ్బుతో కొన్న 1000 ఎగ్ పఫ్ లు తిన్నా*ను అని దొం*గ బిల్లు లు పెట్టాడు అంట కదా. ( వాళ్ళ ఇంట్లో రోజు అన్నం వందుకోరా ఏమిటి, లేకపోతే తనకి పెట్టరా)

    తానే నిజంగా అన్ని తేనేశాను అని అఫిడవిట్ ఇవ్వమని చెప్పి.

  2. సిగ్గులేని GA…. నీకు కడుపుమంట వల్ల కనిపించ లేదేమో కానీ….pawan ఈ 100 days లో గ్రామ పంచాయితీలకు చేసిన దాంట్లో 10% కూడా చెయ్యలేదు మీ ముష్టి govt last 5 లో…..

      1. ప్రతీ రోజు ఏదో చేసేస్తున్నట్టు నకిలీ ఫొటోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారు…… అదే వీడి ఘనత

        1. సినిమాల్లో ఫేక్ కలెక్షన్స్ రాజకీయాల్లో ఫేక్ పిక్చర్స్ అన్నమాట

  3. 2029 లో కూటమి ఓటమి తరువాత మొత్తం అవనీతి పవన్ మీదకు నెత్తిన పెట్టి తుమ్మ జాతి తప్పించుకుంటారు పవన్ కేసు లు చుట్టూ తిరుగుతాడు

  4. No body cares for your articles ,like nobody cares for your articles before elections by gifting 11. Only thing Pawan/ CBN want to do imake YCP 000 in 2029 which in itself is development

  5. Shame on you, GA. You haven’t written any articles like these about development in the last five years and you are expecting the new government to do all developments not even with 6months

  6. Shame Kutami..

    Instead of explaining to the public about their achievements / d3velopment and welfare of the people… every week they and their media are coming up with one useless issue and conducting debates and discussions days and months together. It means they have done nothing. Don’t think people are fools. They are more wiser than these socalled political-drama artists.

  7. గుంటూరు లో కొంచెం రోడ్స్ సంగతి చూడండయ్యా… లడ్డూ సంగతి తర్వాత చూద్దూరు గానీ

  8. Okadu abaddam srustisthaadu, inkodu abaddam nethina vesukoni voogipothu joker veshalu vesthadu. Saripoyaaru iddaru rastranni brastu pattinchadaaniki.

  9. ముంపు వచ్చింది విజయవాడ రా అయ్యా! అమరవతి లొ కాదు!!

    విజయవాడ క్రిష్ణ నదికి అటు పక్కన ఉంటె, అమరవతి ఇటు పక్క న ఉంది.

    ఇంకా అమరవతికి ప్రపంచబ్యాంక్ గ్రాంటు కాదు రుణం ఇస్తుంది అని నువ్వె రాసి.. మళ్ళా ఇదెమి గొల రా అయ్యా! అయినా రొజూ ఇదెమి ఎడుపు రా?

  10. People are praising Pawan all over the country after varahi declaration.manam matram edusthu undatmey Pawan medha.siggu undali great Andhra ki.andhra Pradesh ni appula Pradesh kinda me jagan chesi, palace lo babbunnadu.time padutundi kadha?.sanka nakipovadam chala easy bagu cheyatam chala kastam.

  11. Well explanation. But

    ముందు 100 కి నాన్నకి బుడ్డి, తరువాత అమ్మకి వందనం యెప్పుడో? ఈలోపల చదువుకొనే స్తోమత లేక పిల్లలు మల్లి గాలి బ్యాచ్ తో తిరిగి మళ్లీ బుడ్డి కోసం రెడీ అవుతారు. అంతేగా అంతేగా… యధా రాజా తధా ప్రజా.

  12. 1. చెత్త పన్ను తీసేశారు

    2.క్వాటర్ బాటిల్ మందు 95 కే ఇస్తున్నారు. వై చీపి కాలంలో 200 ఉండేది.

    3.3000/- పెన్షన్ 4000 చేశారు మొదటి తారీకు నే అందిస్తున్నారు అందరికీ ఒలంటీర్లు లేకుండా ప్రభుత్వ ఉద్యోగులతో. దానివల్ల రెండు లక్షల మంది వాలంటీర్లు వై చీపి కార్యకర్తలు వారికి ఇచ్చే ఐదు వేల డబ్బులు ప్రభుత్వానికి మిగులుతున్నాయి.

    4.దీపావళి పండుగ నుండి మూడు సిలిండర్లు గ్యాస్ ఇస్తున్నారు.

    5.అన్న క్యాంటీన్లు మళ్ళీ ఓపెన్ చేశారు ఇప్పుడు 150 క్యాంటీన్ నడుస్తున్నాయి. 6.ఉద్యోగస్తులకు అందరికీ మొదటి తారీకున జీతాలు ఇస్తున్నారు పెన్షన్లు అందరికీ అదే రోజున రోజున ఇస్తున్నారు. అంతకుముందు ఎప్పుడు వీలు పడితే అప్పుడు ఇచ్చేవారు పది రోజులు 15 రోజులు లేట్ అయ్యేది.

    7.విశాఖపట్నం రైల్వే జోన్ శంకుస్థాపన తొందరలో జరుగుతుంది. ప్రధానమంత్రిని రమ్మని అడుగుతున్నారు శంకుస్థాపనకు డేట్ పెడతారు.

    8.వర్షాలు వరదలు వల్ల పోలవరం డ్యాం పనులు ఆగాయి డిసెంబర్ నుండి పోలవరం పనులు మొదలవుతాయి 12 వేల కోట్ల రూపాయలు సిద్ధంగా ఉన్నాయి. 9.రాజధాని పనులు ఐదు సంవత్సరాల నుండి ఆపేశారు. టెక్నికల్ గా ఐఐటీ నుండి ఓకే అని రిపోర్టు వచ్చింది. ఆ పనులు డిసెంబర్ నుండి మొదలు పెడుతున్నారు. 10. పంచాయతీల నుండి జగన్మోహన్ రెడ్డి 1300 కోట్లు రూపాయలు లాగేశాడు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం 13500 పంచాయితీలకు 1300 కోట్ల రూపాయలు ఇచ్చారు. గ్రామాల్లో పనులు చేయడానికి.

    11. సుజల స్రవంతి మంచినీరు పథకం కేంద్రం ఇచ్చేది జగన్ ఆపేశాడు ఇప్పుడు దాన్నే మళ్లీ తీసుకువచ్చారు పనులు మొదలు పెడుతున్నారు గ్రామాల్లో అందరికీ మంచినీరు ఇవ్వటానికి.

    12. ఎవరికి ఏ పనిలో అనుభవం ఉంది ఏం పని చేయాలనుకుంటున్నారు అనే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని మొదలు పెడుతున్నారు అందరూ ఇంటర్వ్యూ చేస్తున్నారు. వాళ్ల నేర్పు తెలివిని బట్టి వారికి ట్రైనింగ్ ఇస్తారు భవిష్యత్తు జాగాల కోసం.

    13. 6 200 పోలీసులకు ఉద్యోగాలకు తీసుకోవడానికి నిర్ణయం జరిగింది కార్యక్రమం మొదలుపెట్టారు. డీఎస్సీ 16వేల టీచర్ ఉద్యోగాలకి కార్యక్రమం జరుగుతూ ఉంది డిసెంబర్ లోపు నింపేస్తారు.

    14. గత ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్లో చీఫ్ మినిస్టర్ కూర్చోలేదు ఇంట్లోనే కూర్చునేవాడు. ఇప్పుడు అందరూ సెక్రటేరియట్ లోనే ఉంటున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు సీఎం గారు అక్కడే ఉంటున్నారు.

    15. ప్రపంచ బ్యాంకు ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ లోన్ ఇవ్వటానికి వస్తే జగన్ అండ్ గ్యాంగ్ వాళ్లను ఆపేశారు దొం గ రిపోర్టులు ఇచ్చి లోన్ ఇవ్వద్దు రాజధానికి అని. మళ్ళా వాళ్లే ఇప్పుడు వచ్చి మూడుసార్లు పర్యటించి అమరావతికి ఇప్పటికిప్పుడు నవంబర్ నుంచి 17 వేల కోట్లు ఇవ్వటానికి అగ్రిమెంట్ చేసుకున్నారు నవంబర్ 15 అవుతుంది.

    16. ఐకానికి భవంతులు అమరావతిలో నీళ్లలో మునిగి ఉన్నాయి ఐదు సంవత్సరాలు జగన్ పట్టించుకోలేదు ఇప్పుడు వాటికి నిర్మాణ కాంట్రాక్టులో తీసుక కుంటున్నారు. పనులు డిసెంబర్ నుంచి మొదలవుతున్నాయి దానికి ఎనిమిది వేల కోట్ల రూపాయలు సిద్ధం చేశారు.

    1. 17. ఆర్టీసీ బస్సులు కొత్తవి 1500 ఇప్పటికే చాలా బస్టాండ్లకు ఇచ్చారు. అంతకు ముందు ఐదు సంవత్సరాలు ఒక్క బస్సు కూడా కొనలేదు.

      18. ఐదు సంవత్సరాలలో జగన్ 4,80,000 చెట్లను న రి కే శా డు. కొత్త ప్రభుత్వం వచ్చి కొన్ని లక్షల చెట్లు రాష్ట్రమంతా నాటారు.

      19. తుఫాన్ వరదలు వస్తే చందా వసూలు చేసి ఒక్క రూపాయి నష్టపోయిన వారికి ఇవ్వలేదు జగన్ పాలనలో కానీ కొత్త ప్రభుత్వం విజయవాడలో వరదలు వస్తే 10 రోజులు అక్కడే ఉండి అందరూ చందాలు వేసుకొని 450 కోట్లు రూపాయలు కరెక్ట్ చేసి అందరికీ సహాయం చేశారు.

      20. దగ్గర ఉండి బుడమేరకు వచ్చిన మూడు గండ్లు పూడ్చి వేశారు ఇక పరిశ్రమలు ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పటికే సుమారు పది లక్షల కోట్లకు చేరుకున్నాయి ఇవన్నీ అంచలంచలుగా అమలులోకి వస్తాయి.

      21. కొత్తగా ఏడు విమానాశ్రయాలు కట్టడానికి పథకాలు రచిస్తున్నారు. ఎయిర్ కనెక్టివిటీ ఎక్కువగా చేసే ప్రయాణాలు పెంచి ఆర్థిక పుష్టి కలిగించటానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటికే బొంబాయికి రెండు ఢిల్లీకి రెండు విమానాలు ఎక్స్ట్రా గ నడిపిస్తున్నారు గన్నవరం నుండి..

      22. తిరుమలలో చక్కటి లడ్డు అందిస్తున్నారు తిరుమలలో లడ్డూలు కొన్న వారు చెప్తున్నార అద్భుతంగా ఉన్నాయి అని చాలా మార్పు వచ్చింది అని.

      23. లులు కంపెనీ విజయవాడ విశాఖపట్నం తిరుపతిలో 3 అంతర్జాతీయ షాపింగ్ మాల్స్ పెడుతున్నారు

      ఇలా ఒక్కొక్క ఐటమ్ చెప్పుకుంటూ పోతే 10 లక్షల కోట్ల పెట్టుబడున విషయంలో పది పేజీలు ఈక్కడ రాయవలసి వస్తది ..ఇవ్వని నీకు కనపడపోవడానికి నీలి కామెర్లు వచ్చినట్లుంది . మంచి డాక్టర్ కి చూపించుకోవాలని నా మనవి .

Comments are closed.