కొలికపూడిపై చర్యలకు చంద్రబాబు భయపడుతున్నారా?

మీకు గుర్తుందా? సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై ఇటీవల తెలుగుదేశం పార్టీకే చెందిన ఒక మహిళ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే తనను లైంగికంగా వేధిస్తున్నట్టుగా ఆమె మీడియా ముందుకు వచ్చి చెప్పుకున్నారు. పార్టీ…

మీకు గుర్తుందా? సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై ఇటీవల తెలుగుదేశం పార్టీకే చెందిన ఒక మహిళ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే తనను లైంగికంగా వేధిస్తున్నట్టుగా ఆమె మీడియా ముందుకు వచ్చి చెప్పుకున్నారు. పార్టీ అధినేతకు, లోకేష్ కు కూడా ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ గా స్పందించారు. ఆరోపణలు బహిరంగ ప్రకటనగా వచ్చిన వెంటనే.. ఆదిమూలంను పార్టీనుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేయించారు.

ఎమ్మెల్యే ఆదిమూలంపై పోలీసు కేసు నమోదు అయింది. కోర్టులో విచారణ కూడా జరిగింది. ఆ తర్వాత కొన్ని రోజుల వ్యవధిలోనే పరిస్థితి మారింది. ఆ మహిళ స్వయంగా కోర్టు ఎదుట విచారణకు హాజరై.. తాను చేసిన ఆరోపణలు అన్నీ అబద్ధాలని, ఎమ్మెల్యే తనను వేధించలేదని కోర్టులో చెప్పింది. ఆ కేసును ఉపసంహరించుకునేలా పోలీసుల్ని ఆదేశించాలని కోర్టును కోరింది. ఇంత జరిగినా కూడా.. ఆదిమూలంపై తెలుగుదేశం పార్టీ విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేయడం జరగలేదు.

సీన్ కట్ చేస్తే- తిరువూరు నియోజకవర్గంలో కూడా ఇలాంటి వ్యవహారాలే అనేకం వెలుగులోకి వస్తున్నాయి. అక్కడి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు వ్యతిరేకంగా స్థానికంగా పార్టీవర్గాల్లోనే అసంతృప్తి, ఆగ్రహజ్వాలలు మిన్నంటుతున్నాయి. ఎమ్మెల్యేగా కొలికపూడి వ్యవహారసరళి కూడా ఇప్పటికే పలుమార్లు వివాదాస్పదంగా మారింది.

తమను ఎమ్మెల్యే వేధిస్తున్నారని, అవమానిస్తున్నారని.. పార్టీలో దశాబ్దాలుగా పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలు అధినేతకు మొరపెట్టుకోవడం మాత్రమే కాదు.. నియోజకవర్గంలోని మహిళా ఉద్యోగులకు అర్థరాత్రి వేళ్లలో అసభ్య మెసేజీలు పంపిస్తూ ఎమ్మెల్యే అసహ్యకరమైన రీతిలో వేధిస్తున్నారని కూడా అనేక ఆరోపణలున్నాయి. ఎమ్మెల్యే ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గంలో కులాల పేరుతో చిచ్చు రేపుతున్నారని కూడా సొంత పార్టీ వారే ఆరోపిస్తున్నారు. ఆయనను సస్పెండ్ చేయాలనే డిమాండ్ అక్కడి పార్టీలో తీవ్రంగా ఉంది.

ఇన్ని జరుగుతున్నా సరే.. కొలికపూడి శ్రీనివాసరావుపై కనీసం సస్పెన్షన్ వేటు వేయడానికి చంద్రబాబు నాయుడుకు ధైర్యం చాలడం లేదేమో అనిపిస్తోంది. తాజాగా ఆయనను ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు పిలిపించి, పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, వర్ల రామయ్య తదితర నాయకులు సంజాయిషీ అడిగారు. ‘నా పనితీరు వల్ల కేడర్ లో కొందరితో సమన్వయలోపం ఏర్పడింది. దిద్దుకోవాల్సిన బాధ్యత నాదే.. తీరు సరిచేసుకుంటా’ అని కొలికపూడి వారితో అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

అయితే అంతకు మించి కొలికపూడిని కనీసం, సీరియస్ గా మందలించేలా పార్టీ అధినేత ఎందుకు ధైర్యంగా వ్యవహరించలేకపోతున్నారనేది ఎవ్వరికీ అర్థం కావడం లేదు. కోనేటి ఆదిమూలం, కొలికపూడి శ్రీనివాసరావు ఇద్దరూ కూడా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నాయకులే. ఆదిమూలంపై ఇప్పటిదాకా సస్పెన్షన్ తొలగించే ప్రయత్నం కూడా చేయని చంద్రబాబు, కొలికపూడిని కనీసం మందలించలేకపోతున్నారెందుకు అని పలువురు సందేహిస్తున్నారు.

5 Replies to “కొలికపూడిపై చర్యలకు చంద్రబాబు భయపడుతున్నారా?”

  1. అమరావతి పోరాట దీక్ష తాలూకు confidential information మా సీనన్న దగ్గరుంది.. సస్పెండ్ చేస్తే అన్నీ బయట పడిపోతాయి..

  2. vippi chupinchina vadini…champi door delivery chesina vadini nuvvu venakesuku ravochu….ilanti issues niku baga kanipistayi….koncham patience tho vundu ledante BP/Sugar vachi munde potav

Comments are closed.