‘హరి’ గురించి ఎందుకలా?

కోసరాజు హరికృష్ణ అంటే చాలా మందికి తెలియదు. ఎన్టీఅర్ అర్ట్స్ హరి అంటే ఇండస్ట్రీ జ‌నాలకు తెలుసు. కళ్యాణ్ రామ్ వెనుక వుండి అన్నీ చక్కబెట్టి, అన్నీ చూసుకునే ఈయన ఎన్టీఅర్ వెనుక కూడా…

కోసరాజు హరికృష్ణ అంటే చాలా మందికి తెలియదు. ఎన్టీఅర్ అర్ట్స్ హరి అంటే ఇండస్ట్రీ జ‌నాలకు తెలుసు. కళ్యాణ్ రామ్ వెనుక వుండి అన్నీ చక్కబెట్టి, అన్నీ చూసుకునే ఈయన ఎన్టీఅర్ వెనుక కూడా ఇప్పుడు తానే అయ్యారు.

ఎన్టీఅర్ కు దోస్త్ లు, పనులు చక్కబెట్టే వాళ్లు ఎందరున్నా, సినిమాల అర్ధిక వ్యవహారాలు చూసేది మాత్రం హరి నే. అలా అని ఎప్పుడూ ఏ స్టేజ్ మీదుకు రారు. ఫంక్షన్ లలో కనిపించరు. ఈ హరి.. నందమూరి కళ్యాణ్ రామ్ కు బావమరిది అవుతారు.

కానీ ఎన్టీఅర్ వున్నట్లుండి మొన్న చేసిన ప్రసంగం హరికృష్ణ వైపు జ‌నాల దృష్టిని మళ్లించింది. ఎవరికి నచ్చినా, నచ్చకున్నా తమకు అన్నీ హరి యే అని, హరి లేకుండా ఎన్టీఅర్ అర్ట్స్ లేదని కుండ బద్దలు కొట్టారు. ఓ క్లోజ్డ్ డోర్ సక్సెస్ మీట్ లో ఎన్టీఅర్ ఎందుకు ఇలా అనాల్సి వచ్చింది అన్నది పాయింట్.

ఎన్టీఅర్ దగ్గరగా కొంత మంది వున్నారు. మరి వారికి హరి నచ్చడం లేదా? లేదా ఎన్టీఅర్ తో దేవర సినిమా తీసిన మిక్కిలినేని సుధాకర్ కు నచ్చలేదా? ఎవరిని ఉద్దేశించి ఈ మాట అన్నది?

గతంలో ఎన్టీఅర్- త్రివిక్రమ్ ప్రాజెక్ట్ అర్థాంతరంగా అగిపోవడం వెనుక కూడా హరి వున్నారనే టాక్ అప్పట్లో వినిపించింది. హరి ప్రతిపాదించిన భాగస్వామ్య లెక్కలు నచ్చకే అ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లలేదని టాక్ వుంది. కానీ ఇప్పుడు హరితో హారిక హాసినికి అంతా బాగానే వుంది. నిజానికి నాగవంశీ కలుగచేసుకుని, దేవర సినిమా తీసుకోకుండా వుంటే పరిస్థితి వేరుగా వుండేది. అందువల్ల ఎన్టీఅర్ వార్నింగ్ అటు ఉద్దేశించి కాదు.

మరి ఎందుకు ఎన్టీఅర్ ఇలా కుండబద్దలు కొట్టాల్సి వచ్చింది అన్నది తెలియాల్సి వుంది.

5 Replies to “‘హరి’ గురించి ఎందుకలా?”

Comments are closed.