ఈ ఇంటర్ నెట్ యుగంలో ఎవరు ఎప్పుడు సెలబ్రెటీగా మారుతారో ఎవరికి తెలియదు. ఎక్కడో చిన్న పల్లె టూరులో ఉండే వారు కూడా యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాధిస్తూనే మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇక కాస్తా సెలబ్రెటీ హోదా ఉన్నవారైతే వారేం చేసిన యూట్యూబ్ లో పెడుతుంటారు. ఇందులో సెలబ్రెటీల హోంటూర్లు, ఫ్రిజ్ టూర్లు ప్రతేక్యం. అ వీడియోల వల్ల వారు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్స్ కు గురవుతుంటారు.
ఇటీవల కాలంలో అలాగే హోంటూర్ చేసిన తమిళ నటుడు రోబో శంకర్ చిక్కుల్లో పడ్డారు. హోం టూర్ పేరుతో ఇంటిని మొత్తం వీడియో తీసిన శంకర్ దానిని యూట్యూబ్ పెట్టారు. కానీ ఆ వీడియోలో అలెంగ్జాండ్రిన్ పారాకీట్ అనే రెండు చిలుకలు పంజరంలో ఉండడాన్ని గుర్తించిన అటవీశాఖ అధికారులు వెంటనే నటుడి ఇంటికి చేరుకుని చిలుకలను స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై విచారణకు రావాలని అధికారులు నోటిసులు ఇవ్వడంతో అధికారుల ఎదుట శంకర్ హాజరై వివరణ ఇచ్చారు.
మూడేళ్ల క్రితం తన తన భార్య స్నేహితురాలు ఆ చిలుకలను ఇచ్చిందని.. వాటిని పెంచేందుకు ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ పర్మిషన్ తీసుకోవాలన్న విషయం తెలియదని, తనను క్షమించాలని కోరారు. దీంతో అధికారులు వారిపై ఎటువంటి కేసును నమోదు చేయకుండా రూ. 2.5 లక్షల జరిమానా విధించారు.