Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఆత్మహత్య చేసుకున్న యువ నటి ఆకాంక్ష దూబే!

ఆత్మహత్య చేసుకున్న యువ నటి ఆకాంక్ష దూబే!

చిత్ర‌పరిశ్ర‌మ‌లో విషాదం నెల‌కొంది. భోజ్ పురి ఇండ‌స్ట్రీకి చెందిన యువనటి నటి ఆకాంక్ష దూబే ఉత్తరప్రదేశ్‌లోని వార‌ణాసిలోని ఓ హోట‌ల్ లో ఉరేసుకుని అత్మ‌హ‌త్మ చేసుకుంది. శనివారం రాత్రి షూటింగ్ పూర్తి చేసుకొని వచ్చిన ఆకాంక్ష సారనాథ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సోమేంద్ర హోటల్‌లో చేరుకుంది. ఆదివారం హోటల్‌ గదిలో ఉరికి వేలాడుతూ కనిపించింది.

సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆమె.. నిత్యం డ్యాన్స్ రీల్స్ తో అభిమానుల‌ను అల‌రించేది. ఆకాంక్ష దుబే భోజ్‌పురి పరిశ్రమలో రాకేష్ మిశ్రా మ్యూజిక్ వీడియో ‘తు జవాన్ హమ్ లైకా’తో తన కెరీర్‌ను ప్రారంభించింది. 17ఏళ్ల‌కే సినిమాల్లోకి వ‌చ్చిన ఆమె... డిప్రెష‌న్ తో కొన్నాళ్లు సినిమాల‌కు బ్రేక్ తీసుకుని, మ‌ళ్లీ రీఎంట్రి ఇచ్చింది.

ఇదిలా ఉండగా.. ఆత్మహత్యకు ముందు ‘వీరోన్ కే వీర్’, ‘కసమ్ బద్నా వాలే కి 2’ చిత్రాల్లో నటించిన ఆకాంక్ష.. భోజ్‌పురి పవర్ స్టార్ పవన్ సింగ్‌తో కలిసి నర్తించిన కొత్త పాటను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ‘ఏ ఆరా కభీ హర నహీ’ అంటూ సాగే ఈ పాటకు యూట్యూబ్‌లో మంచి స్పందన వస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?