ప్రస్తుతం ఇండస్ట్రీలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్నట్టుంది. కత్రినాకైఫ్, అలియాభట్ లాంటి బాలీవుడ్ హీరోయిన్లతో పాటు.. సౌత్ నుంచి కూడా చాలామంది హీరోలు, హీరోయిన్లు గడిచిన 2-3 ఏళ్లలో పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి పవన్ కల్యాణ్ హీరోయిన్ కూడా చేరబోతోంది. ఆమె పేరు నికీషా పటేల్.
పవన్ తో కొమరం పులి అనే సినిమా చేసిన నికీషా.. తన పెళ్లి మేటర్ బయటపెట్టింది. త్వరలోనే తను పెళ్లి చేసుకుంటానని ఈమె ఎనౌన్స్ చేసింది. ఇన్నాళ్లకు తనకు కావాల్సిన వాడు దొరికాడని, బ్రిటన్ లో అతడ్ని వెదికి పట్టుకున్నానని తెలిపింది. త్వరలో అతడ్నే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. అయితే అతడు భారతీయుడా లేక బ్రిటిషరా అనేది నికీషా క్లారిటీ ఇవ్వలేదు.
తెలుగులో ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. ఆ తర్వాత తమిళ, కన్నడ సినిమాలు కూడా ట్రై చేసింది. అక్కడ కూడా ఆమెకు ఛాన్సులు అంతంతమాత్రంగానే ఉన్నాయి. దీంతో టోటల్ కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టేసి, లండన్ వెళ్లిపోయింది. అక్కడే తన మనసుకు నచ్చిన పనులు చేసుకుంటోంది.
అయితే లండన్ వెళ్లిపోయినా, టాలీవుడ్ తో రెగ్యులర్ గా టచ్ లోనే ఉంటోంది ఈ బ్యూటీ. ఎప్పటికప్పుడు ట్విట్టర్ లో ఛాట్ చేస్తుంది. హీరోల పుట్టినరోజులకు శుభాకాంక్షలు కూడా పెడుతుంది. ఈ క్రమంలో “పెళ్లెప్పుడు చేసుకుంటావ్” అంటూ ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు త్వరలోనే అంటూ సమాధానం ఇచ్చింది. అతడు బ్రిటన్ లోనే ఉన్నాడని కూడా తెలిపింది. సో.. నికీషా ప్రస్తుతం సింగిల్ కాదని, ఆమె డేటింగ్ లోనే ఉందనే విషయం స్పష్టమైంది.