‘సర్కారు’ రొమాన్స్..అదుర్స్!

సూపర్ స్టార్ మహేష్ లేటెస్ట్ మూవీ 'సర్కారు వారి పాట'. రెండేళ్ల కరోనా గ్యాప్ తరువాత రాబోతున్న సినిమా. మే 12న విడుదల కాబోతున్న ఈ సినిమా మీద అంచనాలు భారీగా వున్నాయి. బజ్…

సూపర్ స్టార్ మహేష్ లేటెస్ట్ మూవీ 'సర్కారు వారి పాట'. రెండేళ్ల కరోనా గ్యాప్ తరువాత రాబోతున్న సినిమా. మే 12న విడుదల కాబోతున్న ఈ సినిమా మీద అంచనాలు భారీగా వున్నాయి. బజ్ కూడా ఆ మేరకు వుంది. 

కీర్తి సురేష్-మహేష్ కాంబినేషన్ లో డైరక్టర్ పరుశురామ్ రూపొందించిన సినిమా ఇది. ఒక పాట మినహా మిగిలిన పనులు అన్నీ ఫినిష్ చేసుకుని, విడుదల దిశగా వెళ్తోంది. మహేష్ డబ్బింగ్ కూడా దాదాపు పూర్తయిపోయింది.

ఇప్పటికి ఈ సినిమా నుంచి రెండు పాటలు విడుదల చేసారు. కళావతి సాంగ్ బాగా వైరల్ అయింది. పెన్నీ..పెన్నీ సాంగ్ కూడా కూడా మంచి అప్లాజ్ వచ్చింది. ఈనెల 22న విడుదల చేయబోయే మూడో సాంగ్ కూడా డ్యూయట్ అని తెలుస్తోంది.

సినిమా ఫస్ట్ హాఫ్ లో దాదాపు నలభై నిమషాలు హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్ వుంటుందని, సినిమాలో మహేష్ చేసిన ఫన్ చాలా బాగా వచ్చిందని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. సినిమాలో మహేష్ మార్క్ వెటకారం, ఫన్ ఓల లెవెల్ లో పండిందని తెలుస్తోంది. గీత గోవిందం సినిమా తరువాత పరుశురామ్ సినిమా ఇది.