టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ ఎమోషనల్ అయ్యారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాజ్ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమాంలో మాట్లాడుతూ.. నేను పంబాబీని అని, సిక్కుని అని… మతం పేరు మీద నన్ను తెలంగాణ నుండి వేరుచేద్దాం అని చూస్తున్నారు అంటూ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు.
తెలంగాణలో పుట్టానని.. తెలంగాణ బిడ్డనని.. నా మతం పేరు చెప్పి దూరం చేయవద్దని వాపోయారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అన్యాయం జరుగుతోందని ..సినీ ఇండస్ట్రీలో తెలంగాణ ప్రాంతానికి ప్రాధాన్యత కావాలన్నారు. సినీ పరిశ్రమలో ఎక్కువగా ముంబై నుంచి వచ్చినవారికే ప్రాధన్యాత ఇస్తున్నారని వాపోయారు.
మరోవైపు ఇదే సమావేశంలో పాల్గొన్న హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి..మరోసారి టంగ్‌స్లిప్ అయ్యారు. వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి చెందిన ఘటనలో.. తనపై ఎన్నో విమర్శలు వచ్చాయని.. బాలుడిని కరవమని తానే చెప్పినట్టుగా ఆరోపణలు చేశారని అసహనం వ్యక్తం చేశారు.
రాజ్భవన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వివిధ రంగాలకు చెందిన మహిళా నిపుణులు, ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. సినీ నటి, బీజేపీ నేత, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బు కూడా సమావేశంలో పాల్గొన్నారు.