దర్శకుడు తేజపై చాలా కంప్లయింట్స్ ఉన్నాయి. హీరోహీరోయిన్లు కొడతాడని, ఎవ్వర్నీ లెక్కచేయడని, తను రాసుకున్న కథలో చిన్న మార్పు కూడా చేయడని.. ఇలా చాలా అంటే చాలా ఫిర్యాదులున్నాయి. ఇప్పుడీ లిస్ట్ లోకి ఒకప్పటి నటి రాశి కూడా చేరింది. గతంలో ఓ సినిమా సందర్భంగా తేజ తనను మోసం చేశాడని ఆరోపించింది రాశి. ఆ సినిమా పేరు నిజం.
“అప్పుడే ఒక్కడు రిలీజైంది. పెద్ద హిట్. మహేష్ బాబు సినిమాలో నాకు ఛాన్స్ ఇచ్చాడు తేజ. గోపీచంద్ కాంబినేషన్ లో నాకు లవ్ అని చెప్పారు. మా ఇద్దరి మధ్య మంచి లవ్ సీన్స్ ఉంటాయని చెప్పారు. గోపీచంద్ కు, నాకు మధ్యలోకి విలన్ వస్తాడని చెప్పారు. నెగెటివ్ షేడ్స్ ఉంటాయని మచ్చుకు కూడా చెప్పలేదు. మంచి క్యారెక్టర్ అనుకొని ఒప్పుకున్నాను. మొదటి రోజు షూటింగ్ లోనే అర్థమైపోయింది.”
తనకు వేసిన మేకప్ చూసిన తర్వాత, ఫస్ట్ డే షాట్ చేసిన తర్వాత తనకు మేటర్ అర్థమైపోయిందంటోంది తేజ. ఆ సినిమా చేయకూడదని అప్పుడే నిర్ణయించుకున్నానని, కానీ అడ్వాన్స్ ఆల్రెడీ తీసుకోవడం వల్ల, సినిమా మధ్యలో వదిలేస్తే చెడ్డపేరు వస్తుందనే భయంతో నిజం సినిమాలో నటించానని చెప్పుకొచ్చింది రాశి. అలా తేజ తనను నిలువునా మోసం చేశాడని మరోసారి ఆరోపించింది.
ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన రాశి.. రంగస్థలంలో రంగమ్మత్త క్యారెక్టర్ కూడా ఫస్ట్ తనకే వచ్చినట్టు తెలిపింది. పాత్ర స్వభావం మేరకు మోకాలు వరకు చీర కట్టుకోవాలని, అది తనకు నచ్చక రంగమ్మత్త పాత్ర చేయడానికి ఒప్పుకోలేదని స్పష్టంచేసింది రాశి.